Guntur Kaaram : గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. మహేష్, దిల్‌రాజు నోట ‘తాట తీస్తా’ మాట..
గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్, దిల్‌రాజు నోట 'తాట తీస్తా' మాట గట్టిగానే పదేపదే వినిపించింది.

Mahesh Babu Dil Raju Comments at Guntur Kaaram Pre release event
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నేడు గుంటూరులో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యి అభిమానులను ఉత్సాహపరిచారు. కాగా ఈ ఈవెంట్ లో ‘తాట తీస్తా’ అనే మాట పదేపదే వినిపించింది.
గత రెండు రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి సినిమాల రిలీజ్‌ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కాంట్రవర్సీలో దిల్ రాజు పేరు తీసుకువస్తూ పలు వెబ్ సైట్స్ తప్పు వార్తలు రాయడంతో.. దిల్ రాజు సీరియస్ అయ్యారు. నిన్న ఓ మూవీ ఫంక్షన్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘తాట తీస్తాను’ అంటూ మీడియా వాళ్ళ పై ఫైర్ అయ్యారు. దీంతో రెండు రోజులు నుంచి ఈ మాట బాగా వైరల్ అవుతుంది.
Also read : Dil Raju : తప్పు వార్తలు రాస్తే.. వెబ్ సైట్ల తాటతీస్తా.. చిరు కామెంట్స్ గురించి దిల్ రాజు..
ఇక నేడు జరిగిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ.. దిల్ రాజుని వేదిక మీదకు పిలుస్తూ ‘తాట తీస్తా’ అనే పదం వాడడం విశేషం. ఇక ఆ తరువాత దిల్ రాజు మాట్లాడుతూ కూడా అదే పదాన్ని వాడడం గమనార్హం. “మహేష్ బాబు ఈ సినిమాతో కలెక్షన్స్ తాట తీస్తాడు” అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ పోకిరి, దూకుడులా చాలా మాస్ గా ఉండబోతుందంటూ పేర్కొన్నారు.
మహేష్ బాబు విషయానికి వస్తే.. శ్రీలీల గురించి మాట్లాడుతూ ఈ మాటని ఉపయోగించారు. “శ్రీలీలని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఓ తెలుగు అమ్మాయి ఇంత పెద్ద హీరోయిన్ అవ్వడం గర్వంగా ఉంది. నా కెరీర్ లో ఇంత కష్టపడే అమ్మాయిని చూడలేదు. తన సీన్ ఉన్నా లేకున్నా సెట్స్ లోనే ఉంటుంది. ఇక అమ్మాయితో డాన్స్ చేయడం వామ్మో.. హీరోలందరికీ తాట ఊడిపోతుంది” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.