Guntur Kaaram Collections : బాక్సాఫీస్ వద్ద ‘గుంటూరు కారం’ ఘాటు కొనసాగుతూనే ఉంది.. పది రోజుల కలెక్షన్స్ ఎంతంటే..!
మహేష్ బాబు 'గుంటూరు కారం' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా తన ఘాటుని కొనసాగిస్తూనే ఉంది. పది రోజుల కలెక్షన్స్ ఎంతంటే..

Mahesh Babu Guntur Kaaram movie ten days Collections report
Guntur Kaaram Collections : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’.. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా తన ఘాటుని కొనసాగిస్తూనే ఉంది. మహేష్ మాస్ స్వాగ్ చూపిస్తూనే, మదర్ సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది. దీంతో థియేటర్ వద్ద మంచి కలెక్షన్స్ ని నమోదు చేస్తూ సూపర్ హిట్టుగా నిలిచింది. మొదటి రోజే 94 కోట్ల గ్రాస్ ని రాబట్టిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి 164 కోట్ల గ్రాస్ నమోదు చేసింది.
ఇక వారం రోజుల్లో 212 కోట్ల గ్రాస్ ని అందుకొని రెండువందల మార్క్ ని క్రాస్ చేసేసిన ఈ సినిమా.. తాజాగా 10 రోజులు పూర్తి చేసుకునేప్పటికీ 231 కోట్ల గ్రాస్ ని నమోదు చేసింది. అంటే ఈ చివరి మూడురోజుల్లో 19 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్లు తెలుస్తుంది. అటు అమెరికాలో కూడా ఈ సినిమా రెండు మిలియన్ల మార్క్ క్రాస్ చేసి అదిరిపోయే కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది.
Also read : Pawan Kalyan : అయోధ్య రామ మందిరంతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ.. రామకార్యం అంటే ప్రజా కార్యం..
రమణగాడి ????? ?????????? ??????????? Igniting up the box-office!?#GunturKaaram registers a sensational ??? ?? ????? Worldwide in 10 Days ~ ??? ???? ?????? (Highest for a regional cinema)??
Watch the #BlockbusterGunturKaaram… pic.twitter.com/B7Zi1Ty4jW
— Haarika & Hassine Creations (@haarikahassine) January 22, 2024
కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 130 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. దీనిబట్టి చూస్తే.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు 270 కోట్ల గ్రాస్ ని రాబట్టాలి. ప్రస్తుతం వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే.. ఈ సినిమా మరో 39 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంది. ఈ వారం డబ్బింగ్ సినిమాల రిలీజ్ లు తప్ప మరే సినిమా విడుదలలు లేవు. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావడం పెద్ద కష్టం ఏమి కాదు అనిపిస్తుంది.
ఇది ఇలా ఉంటే, ఈ సినిమాని ఆల్రెడీ థియేటర్స్ లో ఒకసారి చూసేసిన ఆడియన్స్.. ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో టెలికాస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి రెండు వారం లేదా మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.