Mahesh Babu : ‘గుంటూరు కారం’ ముందు ‘నేనొక్కడినే’ జ్ఞాపకాలు.. 10 ఏళ్ళ రీయూనియన్..

'1 నేనొక్కడినే' 10 ఏళ్ళ రీయూనియన్. 'గుంటూరు కారం' ముందు 'నేనొక్కడినే' జ్ఞాపకాలు. వైరల్ అవుతున్న ఫోటోలు.

Mahesh Babu : ‘గుంటూరు కారం’ ముందు ‘నేనొక్కడినే’ జ్ఞాపకాలు.. 10 ఏళ్ళ రీయూనియన్..

Mahesh Babu Kriti Sanon reunion photos before guntur kaaram release

Updated On : January 10, 2024 / 4:32 PM IST

Mahesh Babu – Kriti Sanon : అందాల భామ కృతిసనన్.. మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ చిత్రంలో నటించి యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ బి-టౌన్ లో బిజీ అయ్యారు. ఇటీవలే బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. 2014 జనవరి 10న అంటే ఈరోజున ‘1 నేనొక్కడినే’ రిలీజ్ అయ్యింది. నేటితో ఈ చిత్రానికి, కృతిసనన్ కెరీర్ స్టార్ట్ అయ్యి పదేళ్లు పూర్తి అయ్యింది.

నేటితో పదేళ్లు పూర్తీ అవ్వడంతో కృతిసనన్.. తన మొదటి హీరో మహేష్ బాబుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కృతి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. “నా మొదటి సినిమాకి పదేళ్లు అయ్యిపోయింది. ఇన్నాళ్ల ప్రయాణంలో చాలా మార్పులు వచ్చాయి. కానీ మొదటి సినిమా జ్ఞాపకాలు, కృతజ్ఞత నా గుండెల్లో అలానే ఉంది. ఇన్ని సంవత్సరాల తరువాత నా మొదటి హీరోని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ మహేష్ తో ఉన్న ఫోటోని షేర్ చేశారు.

Also read : Guntur Kaaram : మహిళలకు ‘గుంటూరు కారం’ స్పెషల్ షో.. ఎక్కడ..? ఎప్పుడో తెలుసా..?

Mahesh Babu Kriti Sanon reunion photos before guntur kaaram release

అలాగే నమ్రతతో ఉన్న పిక్ ని కూడా షేర్ చేస్తూ.. “1 నేనొక్కడినే దర్శకుడు సుకుమార్ ని ఈ రీ యూనియన్ లో మిస్ అయ్యినట్లు చెప్పుకొచ్చారు. అలాగే తనకి మంచి డెబ్యూట్, మంచి జ్ఞాపకాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ఆవ్ తుజో మొగ్ కొర్త’ అంటూ సినిమా స్టైల్ లో మూవీ టీం మొత్తానికి ఐ లవ్ యు తెలియజేశారు” ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu Kriti Sanon reunion photos before guntur kaaram release

ఇక ఈ పిక్స్ చూసిన అభిమానులు.. కృతిసనన్ ని మరోసారి మహేష్ తో కలిసి నటించమని రిక్వెస్ట్ లు పెడుతున్నారు. 1 నేనొక్కడినే సినిమాలో ఈ ఇద్దరి జంట ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మహేష్ హైట్ కి కరెక్ట్ సరిపోయే కృతిసనన్.. పర్ఫెక్ట్ స్క్రీన్ పెయిర్ అనిపించుకున్నారు.