Devaki Nandana Vasudeva Teaser : ‘గుంటూరు కారం’తో మహేష్ మేనల్లుడి సినిమా టీజర్.. ఎలా ఉందో చూశారా..?

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ అయ్యింది.

Devaki Nandana Vasudeva Teaser : ‘గుంటూరు కారం’తో మహేష్ మేనల్లుడి సినిమా టీజర్.. ఎలా ఉందో చూశారా..?

Mahesh Babu nephew Ashok Galla Devaki Nandana Vasudeva Teaser released

Updated On : January 10, 2024 / 4:55 PM IST

Devaki Nandana Vasudeva Teaser : సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన మరో హీరో ‘అశోక్ గల్లా’. మహేష్ బాబు మేనల్లుడు అయిన అశోక్.. 2022లో ‘హీరో’ సినిమాతో తెరగేంట్రం చేశారు. మొదటి సినిమాతో డీసెంట్ హిట్టుని అందుకున్న అశోక్.. ఇప్పుడు రెండో సినిమాతో సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టుకున్న ఈ చిత్రం టైటిల్ ని నేడు అనౌన్స్ చేశారు.

గతంలోనే అశోక్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి.. అశోక్ ఈసారి మాస్ రోల్ తో రాబోతున్నట్లు తెలియజేశారు. నేడు ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూనే టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ‘దేవకీ నందన వాసుదేవ’ అనే క్లాసీ టైటిల్ ని ఖరారు చేశారు. పల్లెటూరి బ్యాక్‌గ్రౌండ్ లో ఈ మూవీ సాగబోతోంది. ఇక రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. మరి ఆ టీజర్ వైపు ఓ లుక్ వేసేయండి.

Also read : Mahesh Babu : ‘గుంటూరు కారం’ ముందు ‘నేనొక్కడినే’ జ్ఞాపకాలు.. 10 ఏళ్ళ రీయూనియన్..

కాగా మరో రెండు రోజుల్లో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో గుంటూరు కారం రిలీజ్ అయిన థియేటర్స్ లో ఈ ‘దేవకీ నందన వాసుదేవ’ టీజర్ ని ప్రదర్శించే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాని అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ఈ దర్శకుడు కార్తికేయతో ‘గుణ 369’ సినిమాని తెరకెక్కించారు. కమర్షియల్ సినిమాగా వచ్చిన ఆ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో ఉన్న మరో విశేషం ఏంటంటే.. ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధముగా ఉన్న పాన్ వరల్డ్ మూవీ ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాకి కథని అందిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ చేస్తున్నారు.