Mahesh Babu : తన పాటకి కూతురు స్టెప్పులు.. మురిసిపోతూ మహేష్ బాబు పోస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార వేసిన డాన్స్ కి మహేష్ బాబు మురిసిపోతూ సోషల్ మీడియాలో పోస్ట్ వేశాడు.

Mahesh Babu : తన పాటకి కూతురు స్టెప్పులు.. మురిసిపోతూ మహేష్ బాబు పోస్ట్..

Mahesh Babu

Updated On : January 30, 2023 / 5:09 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార వేసిన డాన్స్ కి మహేష్ బాబు మురిసిపోతూ సోషల్ మీడియాలో పోస్ట్ వేశాడు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే సితార ఫెస్టివల్ టైంలో స్పెషల్ ఫోటోషూట్ లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అలాగే అప్పుడప్పుడు తన తండ్రి మహేష్ సినిమాలోని పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసి మహేష్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా మహేష్ బాబు సినిమాలోని ఒక పాటకి స్టెప్పులు వేసి అదరగొట్టింది.

Sitara Ghattamaneni : మిస్ యూ అన్నయ్య.. వైరల్ అవుతున్న సితార పోస్ట్!

మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అతడు సినిమాకి మణిశర్మ ఇచ్చిన పాటలు ఎంతటి హిట్ అయ్యినవో అందరికి తెలుసు. ఇక ఈ మూవీలో త్రిష డాన్స్ వేసే ‘పిల్ల గాలి అల్లరి’ సాంగ్ చాలా మందికి ఫేవరిట్. ఇప్పుడు ఈ పాటకి ‘అనీ మాస్టర్’ కోరియోగ్రఫీ చేయగా, సితార వేసిన డాన్స్ మాములుగా లేదు. ఎక్స్‌ప్రెషన్స్ పలికిస్తూ గ్రేస్ తో అదరగొట్టేసింది. ఇక ఈ వీడియోని మహేష్ బాబు పోస్ట్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘నీ కళ్ళలోని కొంటె అల్లరి.. నన్ను, నేను డాన్స్ కూడా చూపించేలా చేస్తుంది’ అంటూ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మహేష్ అభిమానులు అయితే సితార వేసిన స్టెప్పులకు ఫిదా అయ్యిపోయి లైక్‌లు కొడుతూ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 షూటింగ్ హైదరాబాద్ సారధి స్టూడియోలో జరుగుతుంది. మూవీలోని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరిపి ఆగష్టు 11న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)