అవును! రాజమౌళితో సినిమా చేస్తున్నా
రాజమౌళితో తప్పకుండా సినిమా ఉంటుంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి అని మహేష్ చెప్పాడు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి అన్నాడు..

రాజమౌళితో తప్పకుండా సినిమా ఉంటుంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి అని మహేష్ చెప్పాడు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి అన్నాడు..
సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. రిలీజ్‌కి చాలా తక్కువ టైమ్ ఉండడంతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంటర్వూలిస్తున్నాడు మహేష్. మహర్షి సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు, తన తర్వాత సినిమాల గురించి మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చెయ్యనున్నాడు అని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు అదే విషయం మహేష్‌ని అడిగితే రాజమౌళితో తప్పకుండా సినిమా ఉంటుంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి అని మహేష్ చెప్పాడు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి అన్నాడు. స్వయంగా మహేష్, రాజమౌళితో సినిమా ఉంటుందని చెప్పడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మించిన మహర్షి మే 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది.