సింహం, కుక్క పదాలను వాడుతూ.. మంచు విష్ణు, మంచు మనోజ్‌ మధ్య ఎక్స్‌లో మాటల యుద్ధం..

మనోజ్‌ పేరెత్తకుండా ట్వీట్‌తో మంచు విష్ణు కౌంటర్‌ ఇవ్వడం, అదే విధంగా మంచు మనోజ్‌ కూడా దెబ్బకు దెబ్బ అనేలా అటాక్‌ చేయడం గమనార్హం.

సింహం, కుక్క పదాలను వాడుతూ.. మంచు విష్ణు, మంచు మనోజ్‌ మధ్య ఎక్స్‌లో మాటల యుద్ధం..

Updated On : January 17, 2025 / 7:09 PM IST

సినీనటులు అన్నదమ్ముళ్లు మంచు విష్ణు, మంచు మనోజ్‌ మధ్య ఎక్స్‌లో మాటల యుద్ధం జరిగింది. తన తండ్రి మంచు మోహన్‌ బాబు నటించిన రౌడీ సినిమాలోని డైలాగ్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ మంచి విష్ణు పలు వ్యాఖ్యలు చేశాడు.

ఈ డైలాగ్ తనకు చాలా ఇష్టమంటూ కామెంట్ చేశాడు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుందని, వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ అని మోహన్ బాబు ఆ సినిమాలో చెప్పిన డైలాగును విష్ణు పోస్ట్ చేశాడు.

దీంతో మంచు విష్ణుకు కౌంటర్‌ ఇస్తూ మంచు మనోజ్ కూడా ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు. “కన్నప్పలో రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజులాగా.. సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్‌ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు” అని అన్నాడు.

కాగా, కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం రాజుకున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం మోహన్‌బాబు వర్సిటీ వద్ద మనోజ్‌ ఆందోళన తెలిపారు. ఇప్పుడు మనోజ్‌ పేరెత్తకుండా ట్వీట్‌తో మంచు విష్ణు కౌంటర్‌ ఇవ్వడం, అదే విధంగా మంచు మనోజ్‌ కూడా దెబ్బకు దెబ్బ అనేలా అటాక్‌ చేయడం గమనార్హం.

 

Cm Chandrababu : స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయం- సీఎం చంద్రబాబు