MAA Elections : ప్రకాశ్ రాజ్‏కు మంచు విష్ణు కౌంటర్

ప్రకాష్ రాజ్ మొసలి కన్నీరు కారుస్తున్నారు.. ఆయన రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ గుడ్ యాక్టర్ అని ఇవాళ అందరికీ అర్థమైంది. ప్రకాష్ రాజ్ అడిగిన ప్రతి విషయానికి క్లారిటీ ఇస్తా.

MAA Elections : ప్రకాశ్ రాజ్‏కు మంచు విష్ణు కౌంటర్

Manchu Vishnu Press Meet On Maa Elections

Updated On : October 5, 2021 / 5:13 PM IST

Manchu Vishnu Press meet on Maa elections : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రచారాలు, ఆరోపణలతో మొదలైన మా ఎన్నికలు. ఇప్పుడు ఫిర్యాదుల వరకు వెళ్లాయి. మా అధ్యక్ష పదవి కోసం గట్టి పోటీ జరుగుతోంది. లోకల్, నాన్ లోకల్ నుంచి ప్రారంభమైన వాదనలు కాస్తా ఇప్పుడు ఒకరికపై మరొకరు విమర్శలకు దిగే వరకు వచ్చింది. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మా ఎన్నికలు మరింత హీటెక్కాయి. ప్రకాశ్ రాశ్  కు కౌంటర్ గా మంచు విష్ణు మీడియా సమావేశం ఏర్పాటుచేసి దీటుగా బదులిచ్చారు.

‘ప్రకాష్ రాజ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ గుడ్ యాక్టర్ అని ఇవాళ అందరికీ అర్థమైందన్నారు. ప్రకాష్ రాజ్ అడిగిన ప్రతి విషయానికి క్లారిటీ ఇస్తానన్నారు. పేపర్ బ్యాలెట్ మాత్రమే కావాలని తాను కోరుతూ ఎన్నికల అధికారికి లేఖ రాసినట్టు వెల్లడించారు.

ఇంకా ఏమన్నారంటే.. ‘మా ప్యానెల్ లో చాలా మంది పేపర్ బ్యాలెట్ నే కోరుతున్నాం. నేను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను. నేను ఈవీఎంకు వెళ్తానని అడిగినా.. నా ప్యానెల్ వాళ్లు బ్యాలెట్ విధానమే కావాలన్నారు. సరే అని బ్యాలెట్ పత్రాలనే కావాలని అడిగాను. రేపు నేను గెలిచిన తర్వాత.. ఈవీఎంలు ట్యాంపరింగ్ అని ప్రకాష్ రాజ్ ఆరోపించే అవకాశం ఉంది. అదే పేపర్ బ్యాలెట్ అయితే.. ఎన్నిసార్లైనా చెక్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా గెలుపు నాదే’ అని తెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎలక్షన్ కమిషన్.. 60 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నామని చెప్పిందన్నారు. కోవిడ్ వంటి ఇబ్బందుల కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై మెసేజ్ కూడా పెట్టారు. నేను ప్రెసిడెంట్ గా పోటీ పడుతున్నా. ప్రతి ఓటర్ ను నేను ఓటు అడిగే హక్కు ఉంది. రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. 60 ఏళ్లు దాటిన చాలా మందికి నేను ప్రత్యేకంగా ఫోన్ చేశాను. అందులో కొందరు ఫిజికల్ గా వచ్చి ఓటు వేస్తానని నాకు చెప్పారు.

మరికొందరు పోస్టల్ బ్యాలెట్ కు వెళ్తామని చెప్పారు. సమయం మించిపోతుందని.. చాలా మంది నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. డబ్బులు ఇస్తామని చెప్పారు. అప్పుడు మేం ఎలక్షన్ కమిషన్ ను సంప్రదించాం. సింగిల్ రిసిప్ట్ తో.. లీగల్ విధానంలో డబ్బులు కట్టాం. అది ఇల్లీగల్ కాదు. తర్వాత.. ఎన్నికల కమిషన్ మమ్మల్ని సంప్రదించి.. టైమ్ ఇస్తామని చెప్పి.. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చింది. ఈ విషయంలో ప్రకాష్ రాజే బీపీ మాత్రలు వేసుకోనట్టుగా ఆవేశపడ్డారని విష్ణు మండిపడ్డారు.