Mahesh Babu: మహేష్ పాటకు మణిశర్మ, కోటి, థమన్‌ల ‘మ్యూజిక్ మ్యాజిక్’!
టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్స్‌గా థమన్, మణిశర్మ, కోటి తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. వారు అందించిన సాంగ్స్ ఎలాంటి చార్ట్‌బస్టర్స్‌గా....

Manisharma Koti Thaman Performs Mahesh Babu Hit Song
Mahesh Babu: టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్స్‌గా థమన్, మణిశర్మ, కోటి తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. వారు అందించిన సాంగ్స్ ఎలాంటి చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయో అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది స్టార్ సింగర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఈ ముగ్గురు కలిసి తాజాగా చేసిన పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
Manisharma : మణిశర్మ తనయుడి నిశ్చితార్థం ప్రముఖ సింగర్ తో..
మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, కోటిలు మణిశర్మతో కలిసి అతడు సినిమాలోని ‘‘అవును నిజం..’’ అనే పాటకు పర్ఫార్మ్ చేశారు. మణిశర్మ కీబోర్డ్ వాయిస్తుండగా, కోటి గిటార్ ప్లే చేశారు. కాగా, థమన్ డ్రమ్స్‌తో ఓ ఆటాడుకున్నాడు. ఈ ముగ్గురు కలిసి చేసిన రచ్చ మామూలుగా లేకపోవడంతో అక్కడున్నవారు తెగ ఎంజాయ్ చేశారు.
ఈ బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. మణిశర్మ ‘అతడు’ సినిమాకు సంగీతాన్ని అందించగా, అది అప్పట్లో ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మరోసారి అతడు వైబ్స్‌ను ఈ పాట రూపంలో వారు మణిశర్మకు బహుమతిగా అందించారు. మొత్తానికి ఈ ముగ్గురు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
What a blast ? Last Night with My dear guru’s #ManiSharma gaaru & #Koti gaaru
We performed this super brilliant track !!
Good to be on drums ?What a high Seriously ??? #Avnunijam From #Athadu pic.twitter.com/LFEtoxXs1v— thaman S (@MusicThaman) July 12, 2022