Salaar : ప్రభాస్ ‘సలార్’తో పోటీపడటానికి రెడీ అయిన తమిళ వివాదాస్పద నటుడు..
సలార్ సినిమాకు పోటీగా ఆల్రెడీ షారుఖ్ ఖాన్ 'డంకీ' సినిమా రాబోతుంది. తాజాగా సలార్ సినిమాతో తమిళ సినిమా ఒకటి క్లాష్ కి రానుంది.

Mansoor Ali Khan Tamil Movie Sarakku Ready to Releasing on Prabhas Salaar Releasing Date
Salaar Movie : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడి ఇప్పుడు డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. సలార్ రెండు పార్టులుగా వస్తుండటంతో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ పాన్ ఇండియా సినిమాగా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఇప్పటికే ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
సలార్ సినిమాకు పోటీగా ఆల్రెడీ షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా రాబోతుంది. మొదట డంకీ సినిమా కూడా సలార్ రోజే డిసెంబర్ 22న రిలీజ్ ప్రకటించినా ఆ తర్వాత క్లాష్ మరింత పెద్దది అవుతుందని ఒక్క రోజు ముందుకి జరిపి డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకైతే ఆ డేట్స్ లో ఈ రెండు సినిమాలు తప్ప ఏ పరిశ్రమలోనూ ఇంకే సినిమాలు ప్రకటించలేదు.
తాజాగా సలార్ సినిమాతో తమిళ సినిమా ఒకటి క్లాష్ కి రానుంది. ఇటీవల త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఈ వివాదంతో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. అయితే మన్సూర్ అలీఖాన్ మెయిన్ లీడ్ లో నటించిన సరక్కు అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు మన్సూర్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మన్సూర్ అలీఖాన్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సరక్కు సినిమా డిసెంబర్ 22న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా మన్సూర్ తన సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.
Also Read : Janhvi – Kushi Kapoor : అక్క తెలుగు ఎంట్రీ.. చెల్లి తమిళ్ ఎంట్రీ.. శ్రీదేవి కూతుళ్లు సౌత్ ని ఏలుతారా?
దీంతో తమిళ్ లో ఈ సినిమా సలార్ తో క్లాష్ కి రానుంది. అయితే ప్రస్తుతం మన్సూర్ వివాదంలో ఉండటంతో పలువురు ఈ సినిమా రిలీజ్ ఆపడానికి ట్రై చేస్తున్నారని, అయినా రిలీజ్ చేసి తీరతాను అని మన్సూర్ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో తెలిపాడు. మరి సరక్కు సినిమా సలార్ రిలీజ్ రోజే థియేటర్స్ లోకి వస్తుందా లేక మన్సూర్ పై ఏవైనా చర్యలు తీసుకుంటే ఈ సినిమా ఆగుతుందా చూడాలి.
#MansoorAliKhan 's home production #Sarakku will clash with #Salaar , #Dunki and #Siren on December 22nd..
He says various industry unions are conspiring to stop his movie's release.. pic.twitter.com/3YWWbS8hiz
— Ramesh Bala (@rameshlaus) November 21, 2023
Check out this awesome fan art of #SalaarCeaseFire by @RebelRelangi ?
Witness the epic saga of #Salaar in @IMAX, only in theaters from December 22nd. pic.twitter.com/KjdfuGijey
— Salaar (@SalaarTheSaga) November 17, 2023