రవితేజ ‘క్రాక్’ ప్రారంభం

మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో ఠాగూర్ మధు నిర్మిస్తున్న ‘క్రాక్’ మూవీ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : November 14, 2019 / 05:47 AM IST
రవితేజ ‘క్రాక్’ ప్రారంభం

Updated On : November 14, 2019 / 5:47 AM IST

మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో ఠాగూర్ మధు నిర్మిస్తున్న ‘క్రాక్’ మూవీ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో, సరస్వతీ ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ‘క్రాక్’ మూవీ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రవితేజ, శృతి హాసన్, కె.రాఘవేంద్రరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, గోపిచంద్ మలినేని, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్, దిల్ రాజు, సాయి మాధవ్ బుర్రా, ఠాగూర్ మధు తదితరులు పాల్గొన్నారు.

రవితేజ, శృతిహాసన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. సురేందర్ రెడ్డి, దిల్ రాజు దర్శకుడికి స్క్రిప్ట్ అందచేశారు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ‘క్రాక్’ ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది.

Read Also : ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ : చిరు చేతుల మీదుగా రేఖ, శ్రీదేవిలకు పురస్కారాలు

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో రెగ్యలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2020 వేసవిలో విడుదల చేయనున్నారు. డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా, మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రఫీ : జీకే విష్ణు, ఎడిటింగ్ : నవీన్ నూలి.