మే 8న రవితేజ ‘‘క్రాక్’’

మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న‘క్రాక్’ మే 8న విడుదల..

  • Published By: sekhar ,Published On : January 27, 2020 / 04:51 AM IST
మే 8న రవితేజ ‘‘క్రాక్’’

Updated On : January 27, 2020 / 4:51 AM IST

మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న‘క్రాక్’ మే 8న విడుదల..

మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమా ‘క్రాక్’.. హీరోగా రవితేజ 66వ సినిమా ఇది.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజతో హ్యాట్రిక్‌కి రెడీ అయ్యాడు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.

Image

Read Also : మ్యాచోస్టార్‌ గోపిచంద్ 28 ‘‘సీటీమార్’’ – ఫస్ట్‌లుక్

జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ పోలీస్ గెటప్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు. మే 8న ప్రపంచ వ్యాప్తంగా ‘క్రాక్’ చిత్రాన్ని భారీగా విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఒక ఇంటెన్స్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి సూపర్ హిట్ తమిళ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు ‘క్రాక్’కు డీఓపీగా పనిచేస్తున్నారు. 

Image
డైలాగ్స్ : సాయిమాధవ్ బుర్రా
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్ : ఎస్. థమన్
సినిమాటోగ్రఫీ : జి.కె.విష్ణు
ఎడిటింగ్ : నవీన్ నూలి
ఆర్ట్ : ఎ.ఎస్. ప్రకాష్
ఫైట్స్ : రామ్-లక్ష్మణ్
మేకప్ : శ్రీనివాస రాజు
కాస్టూమ్స్ : శ్వేత, నీరజ కోన
సహనిర్మాత : అమ్మిరాజు కానుమిల్లి
నిర్మాత : బి.మధు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : గోపీచంద్ మలినేని
బ్యానర్ : సరస్వతి ఫిలిమ్స్ డివిజన్.