టాలీవుడ్ నుంచి ఆ జాబితాలో విజయ్ దేవరకొండ ఒక్కడే

అర్జున్ రెడ్డి ఎంత పని చేసిందో తెలుసా.. ఇటు బాలీవుడ్-టాలీవుడ్ రెండింటిలోనూ చూపించిన ప్రభావం మామూలుగా లేదు. ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా సర్వేలో టాలీవుడ్ నుంచి అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ, బాలీవుడ్ కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ టాప్ పొజిషన్ లో నిలిచారు. టాప్ 1లో షాహిద్ కపూర్ నిలవగా నెం.4స్థానంలో విజయ్ ఉన్నాడు.
ఈ సర్వేలో ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు క్రికెట్ స్టార్లకు అవకాశం కల్పించింది. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారికి ఓటు వేయాలని ఆన్‌లైన్‌లో ఉంచింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఇంకా మరికొంత మంది హీరోలు కూడా ఉన్నారు. తమిళ, కన్నడ ఇలా సౌత్ ఇండియాకు చెందిన స్టార్లు నివీన్ పౌలీ, దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు.
ఇక క్రీడల విషయానికి వచ్చే సరికి విరాట్‌కొహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ వంటి వారు కూడా ఉన్నారు.
టాప్ 5లో విజయ్ దేవరకొండ నిలిచాడు. ఇటీవల కాలంలో నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి వరుస పరాజయాలను చవిచూసినప్పటికి విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.