Sai Durga Tej: ఆ వార్తల్లో నిజం లేదు.. త్వరలో నేనే చెప్తాను.. క్లారిటీ ఇచ్చేసిన మెగా హీరో

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "సంబరాల యేటి గట్టు". కొత్త దర్శకుడు(Sai Durga Tej) రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Sai Durga Tej: ఆ వార్తల్లో నిజం లేదు.. త్వరలో నేనే చెప్తాను.. క్లారిటీ ఇచ్చేసిన మెగా హీరో

Mega hero Sai Durga Tej gives clarity on rumors against him

Updated On : October 31, 2025 / 6:10 PM IST

Sai Durga Tej: సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “సంబరాల యేటి గట్టు”. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై (Sai Durga Tej)ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.125 కోట్లు ఖర్చు చేస్తున్నారు. హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ ఇది. అందుకే, ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.

Geetha Madhuri: గ్రీన్ కలర్ డ్రెస్ లో రామ చిలకలా.. గీతా మాధురి ఫోటోలు

ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ పరంగా, కంటెంట్ పరంగా నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా తరువాత సాయి దుర్గ తేజ్ చేయబోయే సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, సంబరాల యేటి గట్టు తరువాత సాయి దుర్గ తేజ్ దర్శకుడు దేవా కట్టాతో రిపబ్లిక్ 2 చేయడానికి రెడీ అవుతున్నాడట.

గతంలో వీరి కంబోలోనే రిపబ్లిక్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. పొలిటికల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ, కమర్షియల్ గా సక్సెస్ అవలేదు. దానికి సీక్వెల్ గా ఇప్పుడు రిపబ్లిక్ 2 చేస్తున్నారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తలపై స్పందించాడు సాయి దుర్గ తేజ్.. “నేను నెక్స్ట్ రిపబ్లిక్ 2 సినిమా చేస్తున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ రూమర్స్. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సంబరాల యేటి గట్టు మీదే ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తోంది. కాబట్టి, ముందు ఆ సినిమా గురించే ఆలోచిస్తున్నాం. నా నెక్స్ట్ సినిమా గురించి నేను గానీ, నా టీం గానీ అధికారిక ప్రకటన చేస్తాం. అప్పటివరకు ఎలాంటి రూమర్స్ నమ్మకండి” అంటూ క్లారిటీ ఇచ్చాడు సాయి దుర్గ తేజ్. దీంతో, ఆయన నెక్స్ట్ సినిమాపై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది.