Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కి మెగా న్యూస్.. 2026లో ఏకంగా మూడు సినిమాలు.. మరో సినిమా స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ లో ఉన్నారు. వరుసగా సినిమాలతో ఆడియన్స్ ను (Chiranjeevi)ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అందులో భాగంగానే క్రేజీ సినిమాలను ఒకే చేస్తున్నాడు.

Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కి మెగా న్యూస్.. 2026లో ఏకంగా మూడు సినిమాలు.. మరో సినిమా స్టార్ట్..

Megastar Chiranjeevi 3 film are going to release in 2026

Updated On : October 24, 2025 / 5:01 PM IST

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ లో ఉన్నారు. వరుసగా సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అందులో భాగంగానే క్రేజీ సినిమాలను ఒకే చేస్తున్నాడు. ఓకే చేయడమే కాదు.. ఒకే సంవత్సరంలో మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే(Chiranjeevi). అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

Kalyan Ram: “పుష్ప” రైటర్ తో కళ్యాణ్ రామ్ మూవీ.. పటాస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..

ఈ సినిమా తరువాత మెగాస్టార్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా లేట్ అవుతూ వస్తోంది. దీంతో, ఈ సినిమాను 2026 సమ్మర్ లో విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమా విడుదల అయ్యాక మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు చిరంజీవి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చింది.

రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకానుంది. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది అంటే 2026 దసరా కానుకంగా విడుదల చేయాలనీ చేస్తున్నారు మేకర్స్. గతంలో చిరంజీవి-బాబీ కొల్లి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించిన నేపధ్యంలో ఈ కొత్త సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. అలా ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో మెగా ఫ్యాన్స్ ని అలరించేందుకు ఫిక్స్ అయ్యాడు మెగాస్టార్. అలాగే, 2026 లోనే మరో క్రేజీ సినిమాను మొదలుపెట్టనున్నాడు చిరంజీవి. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిరుతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ కూడా 2026 లోనే మొదలుకానుంది.