Kalyan Ram: “పుష్ప” రైటర్ తో కళ్యాణ్ రామ్ మూవీ.. పటాస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..
నందమూరి కళ్యాణ్ రామ్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. రీసెంట్ గా(Kalyan Ram) ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి. ఆయన చివరి హిట్ సినిమా బింబిసార.
Hero Kalyan Ram to do a film with Pushpa writer Srikanth Vissa
Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి. ఆయన చివరి హిట్ సినిమా బింబిసార. ఫాంటసీ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా (Kalyan Ram)నిలిచింది. ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ అమిగోస్, డెవిల్, అర్జున్ సన్ అఫ్ వైజయంతి సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. దాంతో, ఆయన నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే తాజాగా ఒక ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కళ్యాణ్ రామ్.
Balakrishna: టైం ట్రావెల్ చేయనున్న బాలయ్య.. ఆదిత్య 999 కంటే ముందే.. నవంబర్ లోనే ముహూర్తం..
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఎంత భారీ విజయాన్ని సాధించాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా విజయంలో డైలాగ్స్ పాత్ర చాలా కీలకం అని చెప్పాలి. ఆ డైలాగ్ రాసిన రచయిత శ్రీకాంత్ విస్సా. ఈ రచయిత రీసెంట్ గా కళ్యాణ్ రామ్ కి ఒక కథను వినిపించాడట. కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట. ఈ కథ అయితే తనకుక్ పర్ఫెక్ట్ అని ఫీలవుతున్నాడట కళ్యాణ్ రామ్. ఫైనల్ న్యారేషన్ త్వరగా కంప్లీట్ చేసి త్వరలోనే ఈ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడట కళ్యాణ్ రామ్.
పుష్ప రేంజ్ లోనే కళ్యాణ్ రామ్ కోసం కూడా ఒక రా అండ్ రస్టిక్ కథను సెట్ చేశాడట శ్రీకాంత్ విస్సా. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. ఇక గతంలో కుడా కళ్యాణ్ రామ్ బ్యాడ్ టైం లో ఉన్నప్పుడు రచయిత అనిల్ రావిపూడితో పటాస్ సినిమాను చేశాడు. ఈ సినిమా ఆయన కెరీర్ కి ఒక రేంజ్ లో బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు కూడా మరోసారి రైటర్ శ్రీకాంత్ విస్సా తో సినిమాను సెట్ చేస్తున్నాడు. కాబట్టి, మరోసారి పటాస్ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది అని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది కళ్యాణ్ రామ్. మరి ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యి కళ్యాణ్ రామ్ కి హిట్ పడుతుందా అనేది చూడాలి.
