Chiranjeevi : ‘విశ్వంభర’ షూట్‌లో.. త్రిషకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్..

తాజాగా విశ్వంభర షూట్ లో మెగాస్టార్ చిరంజీవి త్రిషకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.

Chiranjeevi : ‘విశ్వంభర’ షూట్‌లో.. త్రిషకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్..

Updated On : March 10, 2024 / 9:26 PM IST

Chiranjeevi : చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర(Vishwambhara) సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పడంతో శరవేగంగా షూట్ జరుగుతుంది. ఇక ఈ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా విశ్వంభర షూట్ లో మెగాస్టార్ చిరంజీవి త్రిషకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ని వీడియో తీసి త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. చాలా ఫ్యాన్సీగా ఉంది. నా సొంత టెంపరేచర్ కంట్రోల్ మగ్. నాకు బాగా నచ్చింది. థ్యాంక్యూ చిరు సర్ అని తెలిపింది. ఇంతకీ చిరంజీవి త్రిషకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే ఒక ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ బాటిల్ లాంటింది. దాంట్లో వాటర్, కాఫీ, టీ.. లాంటివి పోసుకొని మనకు తగ్గ టెంపరేచర్ లో ఉంచుకోవచ్చు.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ కొత్త యాడ్ చూశారా? పైప్ తో కొడితే.. లీక్ అయ్యేదేలే..

అంతే కాకుండా ఆ బాటిల్ పై ‘హలో త్రిష్’ అని లైటింగ్ తో పేరు వచ్చేలా కూడా ఉంది. దీంతో ఈ బాటిల్ త్రిషకు బాగా నచ్చింది. చిరంజీవి త్రిషకు ఈ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం, త్రిష దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ నచ్చింది అని చెప్పడంతో ఈ బాటిల్ వైరల్ అవుతుంది.

Megastar Chiranjeevi gives Special Gift to Trisha in Vishwambhara Movie Sets