Chiranjeevi – Chandrababu Naidu : దసరా నాడు ఏపీ సీఎం చంద్రబాబుని కలిసిన మెగాస్టార్.. ఫొటోలు వైరల్..

తాజాగా నేడు దసరా పండుగ నాడు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుని క‌లిసి చిరంజీవి..

Chiranjeevi – Chandrababu Naidu : దసరా నాడు ఏపీ సీఎం చంద్రబాబుని కలిసిన మెగాస్టార్.. ఫొటోలు వైరల్..

Megastar Chiranjeevi Meets AP CM Chandrababu Naidu Photos goes Viral

Updated On : October 12, 2024 / 8:23 PM IST

Chiranjeevi – Chandrababu Naidu : ఇటీవల ఏపీ, తెలంగాణాలో వర్షాల వల్ల వరదలు ఏర్పడి అనేక ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ వరదలతో ఎంతోమంది నష్టపోయారు. వరద బాధితుల కోసం టాలీవుడ్ లోని చాలా మంది స్టార్స్ భారీగా విరాళాలు ఇచ్చారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల‌కు త‌లో కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్రకటించారు.

Also Read : Balakrishna – NBK 109 : మరోసారి సంక్రాంతి బరిలో బాలయ్య.. ఈసారి చరణ్‌తో పోటీ.. NBK109 అప్డేట్..

ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆ విరాళం అందించగా తాజాగా నేడు దసరా పండుగ నాడు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుని క‌లిసి చిరంజీవి త‌న యాబై ల‌క్ష‌ల రూప‌యాల‌ చెక్‌తో పాటు, రామ్ చ‌ర‌ణ్ యాబై ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను మొత్తం కోటి రూపాయ‌ల చెక్‌ల‌ను అంద‌జేశారు. సీఎం చంద్రబాబు మెగాస్టార్ ని అభినందించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుని మెగాస్టార్ కలవడంతో ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Megastar Chiranjeevi Meets AP CM Chandrababu Naidu Photos goes Viral