NTR : RRRలో నాకు నచ్చిన యాక్టర్ ఎన్టీఆర్.. జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి..!

జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి.. RRRలో తనకి నచ్చిన యాక్టర్ ఎన్టీఆరే అంటూ చెప్పుకొచ్చారు. ఆ వీడియో..

NTR : RRRలో నాకు నచ్చిన యాక్టర్ ఎన్టీఆర్.. జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి..!

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ (Ram Charan) కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR. ఈ మూవీలో ఫ్రీడమ్ ఫైటర్ కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అద్భుత నటన ప్రదర్శించారు. వీరి నటనకి ఇండియన్ ఆడియన్స్ తో పాటు విదేశీ ప్రేక్షకులను కూడా ఫిదా అయ్యిపోయారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్.. పులితో ఇంట్రడక్షన్ సీన్ అండ్ ఇంటర్వెల్ లో యానిమల్ ఫైట్ సీన్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. సరిగ్గా చెప్పాలంటే ఎన్టీఆర్ ని ఒక సూపర్ హీరోలా ప్రాజెక్ట్ చేసింది.

Suriya 43 : సూర్య 43 ఫిక్స్.. సుధా కొంగర డైరెక్షన్.. దుల్కర్ సల్మాన్ స్పెషల్ అప్పీరెన్స్.. GV ప్రకాష్ 100వ సినిమా కూడా..

దీంతో ఎన్టీఆర్ కి ఇంటర్నేషనల్ లెవెల్ భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. విదేశీ మంత్రులు కూడా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అయ్యిపోతున్నారు. జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి.. ఒక సమావేశంలో తాను కూడా ఆర్ఆర్ఆర్ చూసినట్లు, మూవీలో నటించిన చరణ్ అండ్ ఎన్టీఆర్ లో తన ఫేవరెట్ యాక్టర్ మాత్రం ఎన్టీఆరే అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని జూనియర్ అభిమానులు షేర్లు చేస్తూ గ్లోబల్ స్టార్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి జపాన్ లో ఫాలోయింగ్ RRR తో వచ్చింది కాదు. సింహాద్రి సినిమాతోనే అక్కడ మంచి ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

Bro Movie : ఒరిజినల్ ‘వినోదయసీతం’.. ‘బ్రో’ సినిమాకు తేడాలు ఇవే.. 5 కోట్ల బడ్జెట్ వర్సెస్ 75 కోట్ల బడ్జెట్..

ఇక ఈ మూవీతో ఆ అభిమానం మరింత పెరిగింది. ఆర్ఆర్ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి 275 రోజులు పైగా అవుతుంది. అయితే ఇప్పటి వరకు జాపనీస్ సబ్ టైటిల్స్ తో తెలుగు లాంగ్వేజ్ లో రన్ అయ్యింది. నేటి (జులై 28) నుంచి జపనీస్‌ లాంగ్వేజ్ లో సినిమా రన్ కాబోతుంది. దీంతో మూవీకి అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగాయి. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా ఈ మూవీ సుమారు 140 కోట్ల 14 లక్షల వరకు కలెక్ట్ చేసినట్లు సమాచారం.