మోహన్ లాల్ ‘బిగ్ బ్రదర్’ – మోషన్ పోస్టర్
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటిస్తున్న మలయాళ సినిమా 'బిగ్ బ్రదర్' మోషన్ పోస్టర్ రిలీజ్..

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటిస్తున్న మలయాళ సినిమా ‘బిగ్ బ్రదర్’ మోషన్ పోస్టర్ రిలీజ్..
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా, సిద్ధిఖీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ సినిమా ‘బిగ్ బ్రదర్’.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదురుడు అర్భాజ్ ఖాన్ మల్లూవుడ్‌కి పరిచయం అవుతున్నాడు.
ఈ సినిమాలో అర్భాజ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నాడు. తాజాగా ‘బిగ్ బ్రదర్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. సట్నా టైటస్ (బిచ్చగాడు ఫేమ్) కథానాయిక. అనూప్ మీనన్, శిల్పా అజయన్, సర్జానో ఖలీద్, విష్ణు ఉన్ని కృష్ణన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
S టాకీస్, షామాన్ ఇంటర్నేషనల్, వైశాఖ సినిమా సంస్థలు నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు 2020 జనవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సంగీతం : దీపక్ దేవ్, కెమెరా : జితూ దామోదర్, ఎడిటింగ్ : K.R.గౌరీ శంకర్.
BigBrother motion poster@SiddiqueDir @arbaazSkhan @mirnaaofficial#BigBrother #Jan2020 pic.twitter.com/fo4M7qwCD1
— Mohanlal (@Mohanlal) November 29, 2019