బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. తెలుగు నటి హేమ పేరు రావడంపై మంచు విష్ణు కీలక కామెంట్స్

Vishnu Manchu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందని అన్నారు. అయితే..

బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. తెలుగు నటి హేమ పేరు రావడంపై మంచు విష్ణు కీలక కామెంట్స్

Manchu Vishnu

తీవ్ర కలకలం రేపిన బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ పేరు రావడంతో దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఇటీవల రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

నిర్ధారణకాని అటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని అన్నారు. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా పరిగణించబడుతుందని తెలిపారు. ఆమె కూడా ఒక తల్లి, భార్య అని అన్నారు. వదంతుల కారణంగా హేమ ఇమేజ్‌ను దూషించడం అన్యాయమని చెప్పారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందని అన్నారు. హేమకు సంబంధించిన కచ్చితమైన సాక్ష్యాలను పోలీసులు అందజేస్తే మా తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అప్పటి వరకు దయచేసి నిరాధారమైన వార్తలను సంచలనం చేయకుండా ఉండాలని కోరారు.

Also Read: బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాలు విసిరాను: మంత్రి కాకాణి