Hema : నటి హేమ పై ‘మా’ అసోసియేషన్ బ్యాన్ ఎత్తివేత..!
నటి హేమ పై ఉన్న బ్యాన్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎత్తివేసింది.

Movie Artists Association Ban lifted on actress Hema
Artist Hema – MAA : ఇటీవల సీనియర్ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో దొరికింది. డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆరోపణలతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె బెయిల్ పై విడుదలైంది. కాగా.. తాను డ్రగ్స్ తీసుకోలేదని ఆమె మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేశారు.
తనను ఎలా బ్యాన్ చేస్తారు అంటూ ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రసిడెంట్ మంచు విష్ణుని హేమ కలిసింది. ఓ లేఖను అందించింది. గత కొన్ని రోజులుగా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలపై ‘మా’ స్పందించిన తీరు తనకు ఆవేదన కలిగించిందన్నారు. తాను బెంగుళూరులో ఒక రేవ్ పార్టీలో పాల్గొన్నానని, అందులో డ్రగ్స్ తీసుకున్నాను అని మీడియా దుష్ప్రచారం చేసిందన్నారు. తనపై అనేక రకాలైన కథనాలు వచ్చాయన్నారు. దీంతో ‘మా’ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు.
Committee Kurrollu : అయ్య బాబోయ్.. ‘కమిటీ కుర్రోళ్ళు’ కలెక్షన్స్ చూసారా..
‘మా’ బైలాస్ ప్రకారం ఎవర్నైనా సస్పెండ్ చేయాలంటే వారికి షోకాజ్ నోటీసు ఇవ్వాలి, వివరణ అడగాలి. కానీ తనకు ఎటువంటి షోకాజ్ నోటీసు జారీ చేయలేదని, తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ‘దోషిగా తేలే వరకు అందరు నిర్దోషులే..’ అని మీరు(మంచు విష్ణు) పెట్టిన ట్వీట్ తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. పోలీసులు ఇప్పటి దాకా కోర్టుకు తనపై ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారన్నారు.
మీడియాలో తనపై నిరాధారమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాను దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక ల్యాబ్లో రక్తపరీక్షలు చేయించుకున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షల్లో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తేలిందన్నారు. త్వరలోనే పోలీసు వారి ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల వివరాలు కూడా బయటకు వస్తాయన్నారు. అందులో కూడా తాను నిర్దోషినని తేలుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ లోపు తనను దోషిగా చిత్రీకరించి ప్రాథమిక సభ్యత్వం తొలగించటం మా సంస్థకు తగదన్నారు.
Kalki Actor : బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై స్పందించిన కల్కి నటుడు
ఈ పరిస్థితులలో ‘మా’ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. కొందరు కావాలని చేస్తున్న ప్రచారం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి నుంచి నన్ను రక్షించాల్సిన బాధ్యత ‘మా’పై ఉంది. మీరు ఈ విషయాన్ని గుర్తించి నాపై విధించిన సస్పెషనను వెంటనే ఎత్తివేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఉత్తరంతో పాటు నా మెడికల్ సర్టిఫికేట్ ని కూడా జత చేస్తున్నాను అని హేమ లేఖలో పేర్కొంది.
అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఆమెపై మా బ్యాన్ ఎత్తివేసినట్లుగా తెలుస్తోంది.