బాలీవుడ్ హీరోతో మహేష్ బాబు మల్టీ స్టారర్: చిరంజీవి సినిమా తర్వాతేనా?

చాలా రోజుల నుంచి మహేష్ బాబు బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లే అంటూ ఎప్పటికప్పుడు కొట్టి పరేశారు మహేష్ బాబు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అవకాశం రావడంతో మహేష్ బాబు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మహేష్ బాబు రణవీర్ సింగ్‌తో పాటు ఓ అడ్వర్టైజ్‌మెంట్ చేయడం కోసం ముంబై వెళ్లాడు. అక్కడే అడ్వర్టైజ్‌మెంట్ పూర్తయ్యాక.. బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ నాడియాద్వాలాతో ఓ అగ్రిమెంట్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది.
టాలీవుడ్‌లో మహేష్ బాబుకు మోస్ట్ హ్యాండ్సమ్ అనే పేరు ఎలా ఉందో? బాలీవుడ్‌లో కూడా రణ్ వీర్ సింగ్‌కి అదే రకమైన పేరు ఉంది. ఇద్దరు హ్యాండ్సమ్ హీరోలు కలిసి ఓ సినిమా చెయ్యడం అంటే మాములు విషయం కాదు. మల్టీస్టారర్ సినిమాలు చెయ్యడానికి మహేష్ బాబు కూడా ఎప్పుడూ వెనకాడరు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో నిజంగానే మల్టీస్టారర్ సినిమా వస్తే అది సెన్సేషన్ అవుతుందని బాలీవుడ్ దర్శక నిర్మాతల అభిప్రాయం.
వీరిద్దరికి యాడ్ ఫిల్మ్‌ల కారణంగా చాలా కాలంగా స్నేహం ఉంది. ప్రస్తుతం రణవీర్ ప్రపంచ కప్ కథాంశం ఆధారంగా 83 అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక విడుదల అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపు మహేష్ బాబు చిరంజీవి సినిమాలో నటిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎంతవరకు ఇదంతా సాధ్యం అవుతుందో..
ఇక ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తారు అనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. గతంలో సందీప్‌తో మహేష్ బాబు ఒక సినిమా చెయ్యవలసి ఉండగా.. ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే అర్జున్ రెడ్డి రీమేక్‌తో బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు సందీప్. ఈ క్రమంలోనే ఈ సినిమాని ఆయనే డైరెక్ట్ చేస్తారు అని అంటున్నారు.