DJ Tillu: ఈ వారం సినిమాలు.. టిల్లుగాడే తోపు అవుతాడా?

కరోనా నుండి కోలుకున్న తెలుగు సినీ పరిశ్రమ మళ్ళీ సినిమాలను బయటకి తెస్తుంది. ఒక్కొక్కరు వరసగా తమ సినిమాలని క్యూలో పెట్టేస్తున్నారు. ఈ వారం ఇటు థియేటర్లలో ఆటో ఓటీటీలో కూడా బాగానే..

DJ Tillu: ఈ వారం సినిమాలు.. టిల్లుగాడే తోపు అవుతాడా?

Dj Tillu

Updated On : February 12, 2022 / 5:51 PM IST

DJ Tillu: కరోనా నుండి కోలుకున్న తెలుగు సినీ పరిశ్రమ మళ్ళీ సినిమాలను బయటకి తెస్తుంది. ఒక్కొక్కరు వరసగా తమ సినిమాలని క్యూలో పెట్టేస్తున్నారు. ఈ వారం ఇటు థియేటర్లలో ఆటో ఓటీటీలో కూడా బాగానే సందడి కనిపిస్తుంది. మాస్ రాజా రవితేజ ఖిలాడీ, సిద్ధూ డీజే టిల్లు, సెహరీ సినిమాలు థియేటర్లలో విడుదల కాగా విక్రమ్ మహాన్ తెలుగు డబ్బింగ్, సుమంత్ మళ్ళీ మొదలైంది, ప్రియమణి భామ కలాపం సినిమాలు తెలుగులో ఓటీటీలో విడుదలయ్యాయి.

Valimai: పాన్ ఇండియా క్రేజ్.. నార్త్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన అజిత్!

థియేటర్లలో విడుదలైన రవితేజ ఖిలాడీ తొలి షో నుండే మిక్సెడ్ టాక్ తెచ్చుకోగా.. సెహరీ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. ఓటీటీలో వచ్చిన సుమంత్ మళ్ళీ మొదలైంది నెగటివ్ టాక్ తెచ్చుకోగా.. భామ కలాపం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చే సినిమాగా ముద్ర వేసుకుంది. విక్రమ్ మహాన్ పర్వాలేదని అనిపించుకున్నా.. డబ్బింగ్ సినిమా కావడం.. పైగా పాత చింతకాయ పచ్చడి లాంటి మద్యపాన నిషేధం అంశంతో సినిమా కాస్త కన్ఫ్యూజన్ చేసేసింది.

Bheemla Nayak: హిందీలో భీమ్లా నాయక్ రిలీజ్ అనౌన్స్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

ఫైనల్ గా థియేటర్లలో.. ఓటీటీలో కూడా తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా డీజే టిల్లు. సెకండ్ పార్ట్ కాస్త గాడి తప్పిన ఫీల్ తెచ్చినా జాతిరత్నాలు తర్వాత టిల్లు గాడు కామెడీతోనే సక్సెస్ అయిపోయాడని విశ్లేషకులు తేల్చేశారు. ఇల్లాజికల్ స్క్రీన్ ప్లే.. సీరియస్ సీన్లలో కూడా కామెడీ ఇరికించడం లాంటి కొన్ని సీన్లు మినహా టిల్లు గాడు యూత్ కి బాగా నచ్చేస్తున్నాడు. దీంతో ఫైనల్ గా ఈ వారం సినిమాలలో టిల్లు గాడే తోపు అవుతాడా అనే చర్చ మొదలైంది. అయితే.. తోలి వారం గడిస్తే కానీ ఏ సినిమా స్థాయి ఏంటో తెలియదు.