Mrunal Thakur : తనని ఒక హ్యాకర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ వీడియో రిలీజ్ చేసిన మృణాల్.. అసలు విషయం ఏంటి?

బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. మొదటి సినిమాతో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం వెకేషన్ టూర్ లో ఉన్న మృణాల్ తనని ఒక హ్యాకర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది.

Mrunal Thakur : తనని ఒక హ్యాకర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ వీడియో రిలీజ్ చేసిన మృణాల్.. అసలు విషయం ఏంటి?

Mrunal Thakur promotions for rana naidu web series

Updated On : March 15, 2023 / 9:40 PM IST

Mrunal Thakur : బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. మొదటి సినిమాతో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం నాని 30వ సినిమాతో మరోసారి తెలుగు సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెకేషన్ టూర్ లో ఉంది. కొన్ని రోజులు నుంచి టూర్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్న ఈ భామ.. తాజాగా తనని ఒక హ్యాకర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అది చూసి అందరూ షాక్ అవుతున్నారు.

Rana Naidu : రానా నాయుడు.. ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఈ రేంజ్ అడల్ట్ సిరీస్ ని ఎలా ఓకే చేశాడు?

అయితే ఈ వీడియోలో చెప్పింది నిజం కాదు. ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం మృణాల్ ఇలా వీడియో చేసింది. టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన ‘రానా నాయుడు’లో.. రానా సెలబ్రేటిస్ కి వచ్చిన ప్రాబ్లెమ్స్ పరిష్కారిస్తుంటాడు. దీంతో పలువురు సెలబ్రేటిస్ ఈ సిరీస్ ని ప్రమోట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ కూడా అలా ప్రమోట్ చేసింది. అమెరికన్ సిరీస్ ‘రే డోనోవన్’కు ఇది అడాప్టేషన్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10న నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయ్యింది.

పూర్తి అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ కొంతమంది ఆడియన్స్ నుంచి వ్యతిరేకతని ఎదురుకుంటుంది. అసలు ఫ్యామిలీ హీరోగా కనిపించే వెంకటేష్ ఈ సిరీస్ పూర్తి విరుద్ధంగా కనిపించడంతో తెలుగు ఆడియన్స్ అంగీకరించలేక పోతున్నారు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ సిరీస్ సూపర్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ప్లిక్స్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)