Murali Mohan : ‘కొంచెం కొంచెం గుడుగుంజం..’ ఐటెం సాంగ్ విన్నారా? మురళీమోహన్ చేతుల మీదుగా లాంచ్..

తాజాగా నేను కీర్తన సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ విడుదల చేశారు.

Murali Mohan : ‘కొంచెం కొంచెం గుడుగుంజం..’ ఐటెం సాంగ్ విన్నారా? మురళీమోహన్ చేతుల మీదుగా లాంచ్..

Murali Mohan Launched Item Song from Nenu Keerthana Movie

Updated On : June 26, 2024 / 3:36 PM IST

Nenu Keerthana Movie Song : రమేష్ బాబు హీరోగా, రిషిత, మేఘన హీరోయిన్స్ గా చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్ పై లక్ష్మి కుమారి నిర్మాణంలో చిమటా రమేష్ బాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నేను కీర్తన’. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, రెండు సాంగ్స్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ విడుదల చేశారు.

Also Read : Nagarjuna : మొన్న తోసేశారు.. ఇవ్వాళ దగ్గరికి తీసుకున్నారు.. నాగార్జున వీడియో వైరల్..

సీనియర్ నటుడు మురళీమోహన్ చేతుల మీదుగా నేను కీర్తన సినిమా నుంచి ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజం..’ అనే ఐటమ్ సాంగ్ ని విడుదల చేశారు. సాంగ్ లాంచ్ అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ.. ఏ భాషలోనైనా డైరెక్టర్స్ కమ్ హీరోస్ చాలా తక్కువగా ఉంటారు. చిమటా రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న నేను కీర్తన ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఇప్పుడు నేను విడుదల చేసిన ఐటమ్ సాంగ్ థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు.

Murali Mohan Launched Item Song from Nenu Keerthana Movie

ఈ పాటని అంచుల నాగేశ్వరరావు రాయగా ML రాజా సంగీత దర్శకత్వంలో హరి గుంట, లాస్య ప్రియా పాడారు. ఇక ఈ ఐటెం సాంగ్ లో రేణు ప్రియా డ్యాన్స్ చేసింది. మీరు కూడా ఈ ఐటెం సాంగ్ వినేయండి..