Ravi Basrur: కేజీఎఫ్, సలార్ కు మించి.. “డ్రాగన్” ఊహకు అందదు.. అంచనాలు పెంచుతున్న రవి బాసృర్

ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసృర్(Ravi Basrur). ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గతంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఉగ్రం, కేజీఎఫ్, సలార్ సినిమాలకు వర్క్ చేశాడు.

Ravi Basrur: కేజీఎఫ్, సలార్ కు మించి.. “డ్రాగన్” ఊహకు అందదు.. అంచనాలు పెంచుతున్న రవి బాసృర్

Music director Ravi Basrur shocking comments on NTR's Dragon movie

Updated On : November 18, 2025 / 1:57 PM IST

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ బాంబోలో ఓ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కేజేఎఫ్, సలార్ బ్లాక్ బస్టర్స్ తరువాత స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి. ఇక హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అవడంతో ఆ అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. నిజానికి ఎన్టీఆర్ కి క్రేజీ ఫాలోయింగ్ ఉంది. దానికి తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ పడితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్లడం ఖాయం. గత రికార్స్డ్ అన్ని గల్లంతవడం ఖాయం. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

NBK 111: రాజ్యంలోకి రాణి ఆగమనం.. ‘మహారాణి’గా నయనతార.. NBK 111 నుంచి క్రేజీ వీడియో

అంతేకాదు, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసృర్(Ravi Basrur). ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గతంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఉగ్రం, కేజీఎఫ్, సలార్ సినిమాలకు వర్క్ చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు ఈయనే వర్క్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈయన నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

“కేజీఎఫ్‌, సలార్‌ లాంటి సూపర్ హిట్స్ తరువాత ప్రశాంత్‌ నీల్‌తో వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్. ప్రశాంత్‌ నీల్‌తో నా బాండింగ్‌ అనేది చాలా స్పెషల్. తక్కువ మాట్లాడుకుంటాం.. ఎక్కువ వర్క్‌ చేస్తాం. ఎన్టీఆర్‌ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాలో విజువల్స్‌ తోపాటు మ్యూజిక్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. ఈసారి ఎలివేషన్స్ తో పాటు, ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశారు దర్శకుడు. కేజీఎఫ్‌, సలార్‌ మ్యూజిక్‌ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అందుకోసం కొత్త ఇన్‌స్ట్రూమెంట్‌ యూజ్ చేస్తున్నాం. అందరికీ తప్పకుండా నచ్చుతుంది”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రవి చేసిన ఈ కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు.