మంచు మనోజ్ పెద్ద మనస్సు

  • Published By: madhu ,Published On : November 22, 2020 / 09:41 PM IST
మంచు మనోజ్ పెద్ద మనస్సు

Updated On : November 23, 2020 / 7:31 AM IST

Manchu Manoj : తమ వారు కష్టాల్లో ఉన్నారు..వారిని ఆదుకోవాలన్న వారికి అభయహస్తం అందిస్తుంటారు పలువురు. అందులో రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, సినీ, ఇతర రంగాలకు చెందిన వారుంటారు. తాజాగా నటుడు మంచు మనోజ్ పెద్ద మనస్సు చాటుకున్నారు. బోన్ కేన్సర్ తో బాధ పడుతున్న ఓ బాబు కుటుంబానికి అండగా నిలిచాడు. అవసరమైన వైద్యాన్ని అందిస్తానని హామీనిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.



ఓ బాబు బోన్ కేన్సర్ తో బాధ పడుతున్నాడని, చికిత్స చేయించే స్థితిలో లేరని తెలుపుతూ..నందమూరి ఫ్యాన్స్, సోనూసూద్ కు ఓ నెటిజన్ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో మనోహర్ బాబు అనే వ్యక్తి మాట్లాడారు. తాను ఆటో డ్రైవర్. తన బిడ్డకు చికిత్స అందించేందుకు డబ్బులు లేవు. సాయం చేయండి..కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ట్వీట్ చూసిన మంచు మనోజ్ చలించిపోయాడు.



ఆసుపత్రి పేరు, వైద్యుల పేర్లు, తన ఇన్ బాక్స్ కు పంపించాలని, ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ గా మారింది. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రేట్ అన్నయ్య..మీరు రియల్ హీరో అంటున్నారు. Meeru manchu manoj kadhu anna MANCHI MANOJ Folded handsFolded hands దైవమ్ మానుష్య రూపేణా అంటూ ఓ నెటిజన్ వెల్లడించాడు. చాలా ధన్యవాదములు అన్న… మీరు ఎప్పుడు ఇలానే పది మందికి సాయం చేసే విధంగా ఉంటూ, ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నారు.