Robinhood : ‘రాబిన్‌హుడ్’లా రాబోతున్న నితిన్.. ఏం దొంగతనం చేస్తాడో?
నితిన్ కొత్త సినిమా పేరు 'రాబిన్ హుడ్' గా ఫిక్స్ చేసారు. మైత్రీ మూవీస్ నిర్మాణంలో నితిన్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Robinhood
Robinhood : నితిన్ కొత్త మూవీ పేరు ‘రాబిన్ హుడ్’ గా ఫిక్స్ చేసారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో నితిన్ ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసింది మూవీ టీమ్. నితిన్ గెటప్, డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమాపై హైప్ పెంచుతున్నాయి.
Sneha Reddy : ఈ కాలం పిల్లల్ని ఎలా పెంచాలో అల్లు అర్జున్ భార్య స్నేహా దగ్గర తెలుసుకోండి
భీష్మ సినిమా తర్వాత వెంకీ కుడుముల డైరెక్షన్‌లో నితిన్ చేస్తున్న మూవీ ‘రాబిన్ హుడ్’. ఈ పేరును కన్ఫమ్ చేస్తూ టీమ్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది. ‘ఆస్తులున్నవాళ్లంతా నా అన్నదమ్ముళ్లు.. ఆభరణాలేసుకున్నవాళ్లంతా నా అక్క చెల్లెళ్లు.. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబరని చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హర్ట్ అవ్వలేదు ఎందుకంటే అయినవాళ్ల దగ్గరకు తీసుకోవడం నా హక్కు. మై బేసిక్ రైట్.. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ.. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ‘ అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో గ్లింప్స్ అదిరింది.
Tillu Square : హమ్మయ్య ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్‌కి రెడీ అయ్యింది.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
గ్లింప్స్ చూస్తుంటే నితిన్ ఇందులో భారీ లెవెల్లో దొంగతనాలు చేస్తాడనిపిస్తోంది. ఇక ఈ సినిమా జనవరి 27న సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయట. నితిన్‌కి జోడీగా మొదట రష్మిక మందన్న అనుకున్నారు. ఆ తర్వాత శ్రీలీల పేరు కూడా వినిపించింది. నిజానికి ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. గతేడాది నితిన్ చేసిన మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు కలిసి రాలేదు. రాబిన్ హుడ్ నితిన్‌కి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.