మ‌జిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 04:37 AM IST
మ‌జిలి మూడో సాంగ్ ‘నా గుండెల్లో’ విడుదల

‘నిన్నుకోరి’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మనకు అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో రియల్ లైఫ్ కపుల్స్ సమంత, నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘మ‌జిలి’. ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఈ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ…వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. ఈ మూవీ విడుదల తేదీని కన్ఫామ్ చేసుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు.
Read Also: అలియా భ‌ట్ అర్ధ‌రాత్రి బ‌ర్త్‌డే వేడుకల‌ు

ఇప్ప‌టికే టీజ‌ర్‌తో పాటు రెండు సాంగ్స్ విడుద‌ల చేసిన టీం తాజాగా ‘నా గుండెల్లో’ అంటూ మూడో సాంగ్ కూడా విడుద‌ల చేశారు. ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది. నాగ చైతన్య దివ్యాన్ష కౌశిక్‌లపై చిత్రీకరించిన ఈ సాంగ్‌కి గోపీ సుందర్ స్వరాలను సమకూర్చగా.. రామ్ బాబు గోసల సాహిత్యం అందించారు. యాజిన్ నిజార్, ఈ బ్యూటిఫుల్ సాంగ్‌ను నికితా గాంధీ ఆలపించారు.