‘నాంది’కి కరోనా కారణం కాదట..

  • Published By: sekhar ,Published On : August 28, 2020 / 03:16 PM IST
‘నాంది’కి కరోనా కారణం కాదట..

Updated On : August 28, 2020 / 4:01 PM IST

Naandhi Team Clarification: కరోనా కారణంగా అల్లరి నరేశ్‌ హీరోగా నటిస్తున్న ‘నాంది’ చిత్రం షూటింగ్‌ నిలిపేశారంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను చిత్ర బృందం ఖండించింది. షూటింగ్‌ నిలిపేయడానికి కరోనా కారణం కాదని స్పష్టం చేసింది. విజయ్‌ కనకమేడల దర్శకుడిగా సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రమిది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కథానాయిక.



లాక్‌డౌన్‌కి ముందే ఈ చిత్రం 80 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మూడు రోజుల పాటు షూటింగ్‌ జరిపారు. వర్షాల వల్ల చిత్రీకరణకు అంతరాయం కలిగింది. చిత్రబృందంలో ఒకరికి కరోనా సోకడం వల్ల షూటింగ్‌ నిలిపేశారని వదంతులు రావడంతో దీనిని చిత్ర బృందం ఖండించింది.
https://10tv.in/act-of-god-coronavirus-pandemic-may-lead-to-economic-contraction-this-fiscal-says-fm-sitharaman/