Nabha Natesh : యాక్సిడెంట్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న నభా నటేష్.. ‘హనుమాన్’ నిర్మాతతో..
నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో సినిమాలో 2021 లో కనిపించింది.

Nabha Natesh Re Entry in Movies after Accident With Hanuman Movie Producer
Nabha Natesh : నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాపులర్ అయిపోయి తెలుగులో వరుస సినిమాలు చేసింది. చివరగా నితిన్ సరసన మాస్ట్రో సినిమాలో 2021 లో కనిపించింది. అప్పట్నుంచి సినిమాలకు దూరంగానే ఉంటుంది నభా నటేష్. కొన్ని రోజులు ఎవరికీ కనపడకుండా పోయిన నభా నటేష్.. తనకి యాక్సిడెంట్ అయిందని, ఎడమ భుజం గాయపడిందని, శస్త్రచికిత్సలు చేసారని గత సంవత్సరం జనవరిలో తెలిపింది.
త్వరలో సినిమాలు చేస్తానని, పూర్తిగా కోలుకున్నాను అని అప్పుడు ప్రకటించింది. అయితే ఇప్పటివరకు అధికారికంగా నభా నటేష్ ఏ సినిమా ప్రకటించలేదు. తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం నభా నటేష్ – ప్రియదర్శి(Priyadarshi) సరసన ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. హనుమాన్(Hanuman) సినిమాతో ఇటీవల మంచి విజయం సాధించిన నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
Also Read : Gaami : మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయిన ‘గామి’.. కలెక్షన్స్‌లో అదరగొడుతుందిగా..
ప్రస్తుతం నభా నటేష్ – ప్రియదర్శి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టు, త్వరలోనే అధికారికంగా ఈ సినిమాని ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసి నభా నటేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులు యాక్టివ్ గా లేకపోయినా కోలుకున్న తర్వాత నభా నటేష్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తుంది.