Naga Chaitanya: కస్టడీ మూవీకి అదే బ్లాక్‌బస్టర్ ఎలిమెంట్ అంటోన్న చైతూ
‘కస్టడీ’ మూవీ తన కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని.. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని హీరో అక్కినేని నాగచైతన్య ధీమా వ్యక్తం చేశాడు.

Naga Chaitanya Comments At Custody Movie Pre-Release Event
Naga Chaitanya: అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కస్టడీ’ మూవీ మే 12న మంచి అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ క్రమంలో కస్టడీ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు.
Naga Chaitanya: మరో క్లీన్ హిట్‌ను రెడీ చేస్తోన్న చైతూ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
కాగా, తనకు ఈ సినిమాలో నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కిందని.. మరోసారి చైతూతో కలిసి నటించడం తనకు సంతోషంగా ఉందని హీరోయిన్ కృతి శెట్టి తెలిపింది. ఇక ఈ సినిమాలో సీఎం పాత్రలో చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చేసిన ప్రియమణి ఈ మూవీ విజయంపై ధీమా వ్యక్తం చేసింది. ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను హీరో అక్కినేని నాగచైతన్య తన అభిమానులతో పంచుకున్నారు. కస్టడీ మూవీ తన కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆయన కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. ఈ సినిమాలో తన పాత్ర పేరు శివ అని.. అది అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని చైతూ తెలిపాడు.
Naga Chaitanya : ఆ విషయంలో మా నాన్న తప్పేమి లేదు.. నాగార్జున పై నాగచైతన్య కామెంట్స్!
ఈ సినిమాకు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఎలిమెంట్ ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అని.. సినిమా థియేటర్లలో వారిచ్చిన మ్యూజిక్‌ను ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చైతూ అన్నాడు. ఇక ఈ సినిమా చివరి 45 నిమిషాలు ప్రేక్షకులు తమను తాము మరిచిపోయి సినిమాలో లీనమైపోతారని.. అంతటి ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని చైతూ తెలిపాడు. మొత్తంగా నాగచైతన్య కస్టడీ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ తెలిపింది.