Dhootha : నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ వచ్చేసింది..
నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది..?

Naga Chaitanya First Web Series Dhootha released in ott
Dhootha : యువసామ్రాట్ నాగచైతన్య కూడా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టేశారు. ఈ అక్కినేని హీరో నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘దూత’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ని విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేశారు. ప్రాచి దేశాయ్, పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్ ఈ సిరీస్ లో ఫీమేల్ లీడ్స్ చేశారు. ఇక ఈ సిరీస్ లో నాగచైతన్య జర్నలిస్ట్ గా కనిపించబోతున్నారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ తో ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది..?
విక్రమ్ కుమార్ రచించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కంటెంట్ గా వచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కి అంతటా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. విక్రమ్ పర్ఫెక్ట్ మిస్టరీ థ్రిల్లర్ ని డెలివర్ చేశారని చెబుతున్నారు. సిరీస్ మొత్తం కంటిన్యూగా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక నాగచైతన్య అయితే తన కెరీర్ బెస్ట్ పర్ఫాఫెన్స్ ఇచ్చి ఓటీటీకి గ్రాండ్ డెబ్యూట్ చేశారని ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. మరి ఈ సిరీస్ ని మీరు కూడా చూసేయండి.
Also read : Nani : సందీప్ వంగా మొదటి సినిమా నానితో చేయాల్సింది.. కానీ ఏమైందంటే..!
ఇక నాగచైతన్య నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. నాగచైతన్య జాలరిగా కనిపించబోతున్నారు. చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ గా ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.