Naga Chaitanya : క్రేజీ కాంబినేషన్..

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - నందిని రెడ్డి దర్శకత్వంలో నటించనున్న సినిమా 2022 జనవరిలో స్టార్ట్ కానుంది..

Naga Chaitanya : క్రేజీ కాంబినేషన్..

Nandini Reddy

Updated On : October 18, 2021 / 6:19 PM IST

Naga Chaitanya: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నారు. పాండమిక్ తర్వాత ప్రేక్షకులను భారీ స్థాయిలో థియేటర్లకు రప్పించి, కలెక్షన్ల కనక వర్షం కురిపించింది.. సెకండ్ వేవ్ తర్వాత ఓవర్సీస్‌లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది చైతు సినిమానే కావడం విశేషం.

AHA : ‘ఆహా’లో ‘లవ్ స్టోరీ’.. డిటిటల్ ట్రైలర్ చూశారా

‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘థ్యాంక్యూ’ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇంతలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆమిర్ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ లో యాక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే తండ్రి నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ మూవీ కూడా స్టార్ట్ చేసేశాడు.

Surekha Vani : సీక్రెట్‌గా సెకండ్ మ్యారేజ్?

ఇదిలా ఉంటే చైతు తర్వాత చెయ్యబోయే సినిమాల కోసం గతకొద్ది రోజులుగా ‘నాంది’ డైరెక్టర్ విజయ్ కనకమేడల, మోహన కృష్ణ ఇంద్రగంటి, శివ నిర్వాణల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కట్ చేస్తే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టాడనే వార్త వైరల్ అవుతోంది.

Akhil Akkineni : ‘టక్కరిదొంగ’ సెట్‌లో ‘సిసింద్రీ’

తెలుగు ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్‌గా సత్తా చాటుతున్న నందిని రెడ్డి దర్శకత్వంలో చైతన్య సినిమా చెయ్యబోతున్నాడు. ‘చుట్టాలబ్బాయి’, ‘నేలటికెట్’, ‘డిస్కో రాజా’ సినిమాలు తీసిన రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించనున్నారు. 2022 జనవరి నుంచి చైతు – నందిని రెడ్డి మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Most Eligible Bachelor : అఖిల్ కోసం అల్లు అర్జున్