NC 24 : విరూపాక్ష ద‌ర్శ‌కుడితో నాగ‌చైత‌న్య కొత్త సినిమా.. మైథలాజిక‌ల్ థ్రిల్ల‌ర్.. పోస్ట‌ర్ అదిరిపోయింది

కింగ్ అక్కినేని నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టినా త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని నాగ చైతన్య‌.

NC 24 : విరూపాక్ష ద‌ర్శ‌కుడితో నాగ‌చైత‌న్య కొత్త సినిమా.. మైథలాజిక‌ల్ థ్రిల్ల‌ర్.. పోస్ట‌ర్ అదిరిపోయింది

Naga Chaitanya new movie NC 24 Director is Karthik Dandu

Updated On : November 23, 2024 / 12:30 PM IST

కింగ్ అక్కినేని నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టినా త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని నాగ చైతన్య‌. జ‌యాప‌జయాల‌తో సంబంధం లేకుండా విల‌క్ష‌ణ సినిమాల‌ను చేస్తూ వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తండేల్ మూవీలో న‌టిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై బ‌న్నివాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. నేడు (న‌వంబ‌ర్ 23) నాగ‌చైత‌న్య బ‌ర్త్ డే.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టించ‌నున్న కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వ‌చ్చింది. నాగ చైత‌న్య కెరీర్‌లో 24వ సినిమాగా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మైథలాజిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్క‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్‌వీసీసీ), సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Mahesh Babu : ‘గర్వంగా ఉంది’.. మేనల్లుడి సక్సెస్ పై మహేష్ ట్వీట్..

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర‌బృందం ఓ పోస్ట‌ర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్‌లో ఒక అద్భుతమైన కన్ను ప్రతీకతో పాటు, రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

Chiranjeevi – Allu Arjun : అల్లు అర్జున్, చిరంజీవిని ఏమని పిలుస్తాడో తెలుసా..

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ షూటింగ్ డిసెంబ‌ర్‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీలో ఇంకా ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నారు అనే విష‌యాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.