Nagachaitanya – Sobhita : పాపం నాగచైతన్య పెళ్లి అక్కడ జరగాల్సింది.. కానీ ఇప్పుడు సెట్ వేసి..
నాగచైతన్య మొదటి మ్యారేజ్ లాగే ఇది కూడా మొదట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకున్నారట.

Nagachaitanya Sobhita Wedding Place Changed Here the Details
Nagachaitanya – Sobhita : హీరో నాగచైతన్య – హీరోయిన్ శోభితలు నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. వీరి పెళ్లి డిసెంబర్ 4న జరుగుతుందని సమాచారం. అయితే ఈ పెళ్లి ఎక్కడ చేస్తారనే టాపిక్ ఇప్పుడు చర్చగా మారింది. నాగచైతన్య మొదటి మ్యారేజ్ లాగే ఇది కూడా మొదట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకున్నారట.
కానీ ఆ తర్వాత ఇటీవల సెలబ్రిటీలు అంతా చేసుకుంటున్నట్టు రాజస్థాన్ లో ఓ ప్యాలెస్ లో చేసుకోవాలి అనుకున్నారట. ఆ ఆలోచన కూడా తర్వాత విరమించుకున్నారు. అయితే హైదరాబాద్ లో నాగార్జున కు N కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు, డబ్బున్న వాళ్ళ పెళ్లిళ్లు ఇక్కడ జరిగాయి. సినిమా వాళ్ళ పెళ్లిళ్లు కూడా ఇక్కడ చాలానే జరిగాయి. కానీ ఇటీవల హైడ్రా N కన్వెన్షన్ బఫర్ జోన్ లో ఉందని కూల్చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ N కన్వెన్షన్ కూల్చకపోతే నాగార్జున.. చైతన్య – శోభిత పెళ్లి అక్కడే చేద్దామనుకున్నారట. ఆ హాల్ చుట్టూ నాగార్జునకు పలు సెంటిమెంట్స్ కూడా ఉన్నాయని టాలీవుడ్ లో టాక్.
Also Read : Shah Rukh Khan : 95 రోజులు షారుఖ్ ఇంటిదగ్గరే.. ఎట్టకేలకు అభిమాని ఎదురుచూపులు ఫలించాయి..
ఇప్పుడు N కన్వెన్షన్ కూడా లేకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి సెట్ భారీగా వేసి చేయనున్నారట. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, సన్నిహితుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరగనుందని, అందుకే తమ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే భారీ పెళ్లి సెట్ వేసి అక్కడే నాగచైతన్య – శోభిత పెళ్లి చేయనున్నట్టు తెలుస్తుంది. మరి పెళ్లి డిసెంబర్ 4న ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి.