Prathinidhi 2 : ప్రశ్నించడానికి మళ్ళీ వచ్చేస్తున్న ప్రతినిధి.. ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్..

నారా రోహిత్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలా నిలిచిన ‘ప్రతినిధి’కి సీక్వెల్ రాబోతుంది. ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు.

Prathinidhi 2 : ప్రశ్నించడానికి మళ్ళీ వచ్చేస్తున్న ప్రతినిధి.. ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్..

Nara Rohit Prathinidhi 2 first look poster and release date

Updated On : July 24, 2023 / 5:08 PM IST

Prathinidhi 2 : కమర్షియల్ ఫార్మట్ లో కాకుండా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వస్తూ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న హీరో ‘నారా రోహిత్’ (Nara Rohit). 2018లో ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా తరువాత మరో మూవీతో ఆడియన్స్ ని పలకరించిన హీరో.. ఈ మధ్యలో ఏపీ పొలిటికల్ ప్రచారాల్లో కూడా కనిపించాడు. దీంతో ఈ హీరో ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేశాడని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చి.. తాను ఇంకా సినిమాలోనే ఉన్నట్లు తెలియజేశాడు.

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి సినిమా టైటిల్‌లో ఇది గమనించారా..? మొత్తం 14 భాషల్లో..!

ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇస్తూ ఒక చిన్న ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. అది చూసిన ఆడియన్స్.. నారా రోహిత్ సూపర్ హిట్ మూవీ ‘ప్రతినిధి’కి సీక్వెల్ అనుకుంటా అని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాన్ని నిజం చేస్తూ రోహిత్.. ప్రతినిధి 2 పోస్టర్ రిలీజ్ చేశాడు. అంతేకాదు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేశాడు. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే నాడు (Jan 25 2024) రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రతినిధి 1 ని ప్రశాంత్ మండవ డైరెక్ట్ చేయగా ఈ సినిమాని మూర్తి దేవగుప్తాపు డైరెక్ట్ చేస్తున్నాడు.

Indra : 21 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఇంద్ర.. అప్పటి రికార్డులు.. కేవలం 5 టికెట్స్ 10 వేల రూపాయిలకి కొన్నారు..

కుమార్రాజా బాతులా, ఆంజనేయులు శ్రీతోట, కొండకల్లా రాజేందర్ రెడ్డి వానరా ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. కాగా 2014లో రిలీజ్ అయిన ‘ప్రతినిధి’ పొలిటికల్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని అలరించి మంచి విజయం అందుకొని నారా రోహిత్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలా నిలిచింది. అలాంటి మూవీకి సీక్వెల్ కావడం, అలాగే ఏపీ పాలిటిక్స్ లో నారా రోహిత్ కూడా యాక్టీవ్ గా ఉండడంతో ఈ సీక్వెల్ పై మరింత ఆసక్తిని కలగజేస్తుంది.