Marokkasari : అంత ఎత్తులో తెరకెక్కిస్తున్న మొదటి సినిమా.. సరికొత్త సినిమాతో రాబోతున్న నరేష్ అగస్త్య
నరేష్ అగస్త్య, సంజనా సారథి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘మరోక్కసారి’. (Marokkasari)
Marokkasari
Marokkasari : డిఫరెంట్ కథలతో వరుస సినిమాలు చేస్తున్న నరేష్ అగస్త్య తాజాగా ఓ ఛాలెంజింగ్ తో సినిమా చేస్తున్నాడు. నరేష్ అగస్త్య, సంజనా సారథి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘మరోక్కసారి’. సి.కె.ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మాణంలో నితిన్ లింగుట్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. బ్రహ్మాజీ, సుధర్షన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాని కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో అందమైన విజువల్స్ తో చిత్రీకరించారు. ఇంత వరకు ఏ ఇండియన్ సినిమా కూడా షూటింగ్ చేయని గురుడోంగ్మార్ లేక్ ప్రదేశంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. టిబెట్ సరిహద్దుకు దగ్గరలోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో 5,430 మీ. ఎత్తులో ఉండే గురుడోంగ్మార్ లేక్‌లో షూటింగ్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా మరొక్కసారి నిలిచింది.
Also Read : Honey : నవీన్ చంద్ర ‘హనీ’ టీజర్ చూశారా.. భయపడాల్సిందే..
సముద్ర మట్టానికి సుమారు 5,430 మీటర్లు అంటే 17,800 అడుగులు ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్ సరస్సు ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులలో ఒకటి. కఠినమైన పరిస్థితుల్లో, ఆర్మీ ప్రత్యేక అనుమతులతో ఈ సినిమాని చిత్రీకరించారు. తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, తీవ్రమైన చలి, పరిమిత షూటింగ్ సమయాల్లో, వాతావరణ మార్పులు.. ఇలా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని షూటింగ్‌ను పూర్తి చేసారు మూవీ యూనిట్.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మూవీ యూనిట్ తెలిపారు. దక్షిణాది భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Swayambhu: నిఖిల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. స్వయంభూ మరోసారి వాయిదా
