Naresh : స్టేజిమీద డ్యాన్సులు, ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్ – పవిత్ర.. పవిత్ర లోకేష్ ని నరేశ్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా?

నరేశ్ - పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నరేశ్ - పవిత్ర తాజాగా ఓంకార్ నిర్వహించే సిక్స్త్ సెన్స్ అనే షోలో పాల్గొన్నారు.

Naresh : స్టేజిమీద డ్యాన్సులు, ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్ – పవిత్ర.. పవిత్ర లోకేష్ ని నరేశ్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా?

Naresh and Pavithra Lokesh dancing and kissing in a TV show

Updated On : May 17, 2023 / 10:17 AM IST

Pavithra Lokesh : నరేశ్(Naresh), పవిత్ర లోకేష్ గురించి అందరికి తెలిసిందే. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతున్న జంట. తాము రిలేషన్ లో ఉన్నాం, పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులు హడావిడి చేశారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి మళ్ళీపెళ్లి(Malli Pelli) అనే సినిమాతో రాబోతున్నాం అంటూ సందడి చేస్తున్నారు. నరేశ్ – పవిత్ర జంటగా MS రాజు దర్శకత్వంలో మళ్ళీ పెళ్లి సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇవి చూసిన తర్వాత ఇది వీరిద్దరి స్టోరీనే కావొచ్చు అని భావిస్తున్నారు.

నరేశ్ – పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నరేశ్ – పవిత్ర తాజాగా ఓంకార్ నిర్వహించే సిక్స్త్ సెన్స్ అనే షోలో పాల్గొన్నారు.

Naresh and Pavithra Lokesh dancing and kissing in a TV show

ED Raids : మొన్న తెలుగు.. ఇప్పుడు తమిళ్ నిర్మాతల ఆఫీసులపై ED దాడులు.. పొన్నియిన్ సెల్వన్ నిర్మాతలపై..

ఈ షోలో.. నరేశ్ – పవిత్ర కలిసి స్టేజిపై డ్యాన్సులు వేశారు. ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకున్నారు. నరేశ్ బొకే ఇచ్చి పవిత్ర చేతికి ముద్దు పెట్టాడు. ఇలా ఇద్దరూ కలిసి స్టేజిపై రచ్చరచ్చ చేశారు. ఇక వీరి రిలేషన్ గురించి ఓంకార్ అడగగా.. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా కలిసే ఉంటాం అంటూ నరేశ్ ప్రేమ కవితలు చెప్పాడు. అలాగే ఈ షోలో ఓంకార్.. పవిత్రని ముద్దుగా ఏమని పిలుస్తారు అని నరేశ్ ని అడగగా.. నరేశ్ అమ్ములు అని పిలుస్తాను అని, మరింత ముద్దు వస్తే అమ్ము అని పిలుస్తాను అని చెప్పాడు. దీంతో లేటు వయసులు ఈ జంట చేసే చిలిపి సందడితో మరోసారి ఈ జంట వైరల్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ సిక్స్త్ సెన్స్ ప్రోమో వైరల్ గా మారయింది. మరి వీళ్ళ మళ్ళీ పెళ్లి సినిమాకు ఏ రేంజ్ లో ప్రేక్షకులు వస్తారో చూడాలి.