సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘‘సింహా’’..

బాలయ్య, బోయపాటి కలయికలో తెరకెక్కిన ‘సింహా’ 10 ఏళ్ల ట్రెండింగ్..

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘‘సింహా’’..

NBK'S Simha Trend On April 29th

Updated On : September 22, 2021 / 3:10 PM IST

బాలయ్య, బోయపాటి కలయికలో తెరకెక్కిన ‘సింహా’ 10 ఏళ్ల ట్రెండింగ్..

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘‘సింహా’’.. కనీవినీ ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ట్రెండింగ్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ.. బాలయ్య, బోయపాటి కలయికలో తెరకెక్కిన మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్.. ‘‘సింహా’’..

2010 ఏప్రిల్ 30న విడుదలైన ఈ చిత్రం 2020 ఏప్రిల్ 30నాటికి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. #SimhaTrendOnApril29th పేరుతో ట్విట్టర్‌లో భారీగా పోస్టులు చేస్తున్నారు.

బుధవారం సాయంత్రం 6 గంటలకు ట్రెండ్‌కి రెడీగా ఉండమంటూ అభిమానులందరికీ పిలుపునిస్తున్నారు. ఈమధ్య కాలంలో బాలయ్య గురించి సోషల్ మీడియాలో ఇంత భారీ స్థాయిలో చర్చ జరగలేదు, ట్రెండ్ కాలేదు.. కానీ నటసింహం ఫ్యాన్స్ బాలయ్యపై అభిమానంతో ‘‘సింహా’’ ట్రెండ్ పెద్ద ఎత్తున చేస్తున్నారు.