Nikhil Siddhartha : మరో పాన్ ఇండియా మూవీతో నిఖిల్.. ఈసారి ఫాంటసీ డ్రామా!

వరుస పాన్ ఇండియా చిత్రాలను ప్రకటిస్తున్న నిఖిల్ సిద్దార్థ.. తాజాగా మరో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశాడు.

Nikhil Siddhartha : మరో పాన్ ఇండియా మూవీతో నిఖిల్.. ఈసారి ఫాంటసీ డ్రామా!

Nikhil Siddhartha announced another pan india project

Updated On : May 31, 2023 / 9:08 PM IST

Nikhil Siddhartha : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ వరుస పాన్ ఇండియా చిత్రాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నాడు. కార్తికేయ 2 తో వచ్చిన ఇమేజ్ ని కాపాడుకునేలా తన తదుపరి ప్రాజెక్ట్స్ ని కూడా సెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్పై (Spy) అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో రెడీ అవుతున్న ఈ హీరో.. ఇటీవలే రామ్ చరణ్ (Ram Charan) నిర్మాణంలో ‘ది ఇండియన్ హౌస్’ అంటూ ఇంకో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. తన 20వ సినిమాని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశాడు.

Aamir Khan : ఇప్పటిలో సినిమాలో నటించే ఆలోచన లేదు.. ఆమిర్‌ఖాన్‌!

స్పై తరువాత ఈ సినిమా ఉండబోతుందని పేర్కొన్నాడు. ఫాంటసీ డ్రామాగా వారియర్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలియజేశాడు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్ లో ఒక బంగారు రాజదండం కనిపిస్తుంది. అది చూస్తుంటే ఇటీవల కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో ఉపయోగించిన ‘సింగోల్’లా కనిపిస్తుంది. ఆ సింగోల్ తమిళనాడు ట్రెడిషన్. ఒక రాజు నుంచి మరో రాజుకి అధికారం బదిలీ చేయడాన్ని గుర్తుగా సింగోల్ ని ఉపయోగిస్తారు. ఏదేమైనా పోస్టర్ ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది.

Vishwak Sen : మరో సీక్వెల్ అనౌన్స్ చేసిన విశ్వక్.. ఏ మూవీకో తెలుసా?

ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రేపు రిలీజ్ చేస్తామంటూ ప్రకటించాడు. కాగా నిఖిల్ ఇప్పుడు నటిస్తున్న స్పై మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. గర్రి బిహెచ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్ గా నటిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)