Spy – Devil : నిఖిల్ స్పై, కళ్యాణ్ రామ్ డెవిల్.. రెండు సినిమాల పాయింట్ ఒకటేనా?
కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కథ, నిఖిల్ స్పై మూవీ స్టోరీ ఒకటేనట. అయితే కొన్ని తేడాలు ఉన్నాయంటూ నిఖిల్ తెలియజేశాడు.

Nikhil Siddhartha Spy Kalyan Ram Devil stories are same
Nikhil Siddhartha – Kalyan Ram : కార్తికేయ 2 (Karthikeya 2) తరువాత నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ స్పై (SPY). ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అండ్ పోస్టర్ ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ మూవీ మరింత హైప్ ని పెంచేసింది. ఈ సినిమా కథ.. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా ఉండబోతుంది అంటూ మేకర్స్ తెలియజేశారు.
Nikhil Siddharth : ఆ పార్టీతో నాకు సంబంధం లేదు..
సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడు అంటూ మనం చదువుకున్నాం. అయితే నిజం అది కాదు, అసలు నిజం మేము చెబుతామంటూ టీజర్ లో చెప్పుకొచ్చారు. అయితే కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం డెవిల్ (Devil). ఈ సినిమా కూడా సుభాష్ చంద్రబోస్ పాయింట్ తోనే రాబోతుందట. స్పై మూవీ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న నిఖిల్ ని ఒక మీడియా ప్రతినిధి ఈ విషయం గురించి ప్రశ్నించాడు. కళ్యాణ్ రామ్ డెవిల్ కూడా ఇదే పాయింట్ తో రాబోతుంది అన్న విషయం తెలుసా? అని అడిగారు.
NTR30 : పవర్‌ఫుల్ టైటిల్‌ని ఫిక్స్ చేస్తున్న ఎన్టీఆర్.. ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న టైటిల్!
దానికి నిఖిల్ బదులిస్తూ.. “మొన్న మా టీజర్ చూసిన తరువాత వాళ్ళకి అర్ధమైంది. అయితే ఇక్కడ కామన్ పాయింట్ సుభాష్ చంద్రబోస్ మాత్రమే. మిగతా అంతా డిఫరెంట్. వాళ్ళ స్టోరీ 1920 లో జరుగుతుంది. మాది ఇప్పటి టైంలో జరుగుతుంది. రెండు సినిమాలు కంప్లీట్ డిఫరెంట్ స్టోరీస్ తో రాబోతున్నాయి” అని తెలియజేశాడు. కాగా డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఆ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది.