NMACC : ఘనంగా ప్రారంభమైన నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌.. భారత కళల కోసం అంబానీ అడుగు..

'నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ని ముంబైలో శుక్రవారం రాత్రి ప్రారంభించగా అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు విచ్చేసి సందడి చేశారు.

NMACC : ఘనంగా ప్రారంభమైన నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌.. భారత కళల కోసం అంబానీ అడుగు..

Nita Mukesh Ambani Cultural Centre Grand Opening at Mumbai

Updated On : April 1, 2023 / 5:51 PM IST

NMACC :  రిలయన్స్(Reliance) కంపెనీతో భారతదేశంలో, ప్రపంచంలో అత్యున్నత సంపన్నుల లిస్ట్ ఉండే ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇప్పటికే అనేక వ్యాపారాల్లో ఎంట్రీ ఇచ్చారు. ముకేశ్ అంబానీ భార్యగా నీతా అంబానీ(Nita Ambani) కూడా ఆ వ్యాపారాల్లో పాలుపంచుకుంటారు. తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ డ్రీం ప్రాజెక్టు ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్'(NMACC) ని ప్రారంభించింది. భారతీయ సంసృతి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్ ని ప్రారంభించింది.

‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) ని ముంబైలో శుక్రవారం రాత్రి ప్రారంభించగా అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు విచ్చేసి సందడి చేశారు. ముంబైలో జియో వరల్డ్ సెంటర్ లో ఈ కల్చరల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. నాలుగంతస్థులు దీనికోసం కేటాయించగా ఇందులో ఒక మ్యూజియం, 2000 మంది ఒకేసారి కూర్చునే థియేటర్, ఆర్ట్ అండ్ ఎగ్జిబిషన్‌ కు రూమ్స్, స్టూడియో.. ఇంకా అనేక విశేషాలతో కూడి ఉంది.

Image

Nani Dasara : అమెరికాలో నాని సరికొత్త రికార్డ్.. మహేష్ తర్వాత నాని ఒక్కడే..

‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ ఓపెనింగ్ కి రజినీకాంత్, షారుఖ్, సల్మాన్, వరుణ్ ధావన్, షారుఖ్ ఫ్యామిలీ, జాన్వీ కపూర్, సిద్దార్థ్ – కియారా, దీపికా- రణవీర్, అలియాభట్ ఫ్యామిలీ, ప్రియాంకచోప్రా ఫ్యామిలీ, అమీర్ ఖాన్, సౌందర్య రజినీకాంత్, సద్గురు, సచిన్ ఫ్యామిలీ, విద్యాబాలన్… ఇలా అనేకమంది బాలీవుడ్, సౌత్, స్పోర్ట్స్, బిజినెస్ స్టార్స్ విచ్చేశారు. దీంతో ఈ ఈవెంట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.