Nithya Menen : ధనుష్‌తో కలిసి ‘ఇడ్లి కొట్టు’ నడపబోతున్న నిత్యామీనన్..? ధనుష్ తో చాయ్ తాగుతూ..
తాజాగా మరోసారి నిత్యా ధనుష్ తో కలిసి నటించబోతుంది.

Nithya Menen and Dhanush will Acting together again Photo goes Viral
Nithya Menen : నిత్యామీనన్ సౌత్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే ధనుష్ తో నటించిన తిరు సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకుంది. తాజాగా మరోసారి నిత్యా ధనుష్ తో కలిసి నటించబోతుంది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది.
ధనుష్ తో కలిసి టీ తాగుతున్నట్టు టీ గ్లాసులను పట్టుకొని దిగిన ఫోటోని నిత్య మీనన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి కొత్త ప్రయాణం మొదలైంది.. ‘ఇడ్లీ కడై’ అని పోస్ట్ చేసింది. దీంతో గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇడ్లీ కొట్టు అనే సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని ధనుష్ దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్, ఇడ్లీ షాప్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని తెలుస్తుంది. గతంలో తిరు సినిమాలో ధనుష్, నిత్యా మీనన్ కలిసి నటించి ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధించారు. మరోసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటంతో ఇప్పట్నుంచే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.