Vettaiyan Collections : రజినీకాంత్ వేట్టయన్ సినిమా ఇప్పటిదాకా ఎంత కలెక్ట్ చేసిందంటే.. దసరా బాగానే కలిసొచ్చింది..
ఫేక్ ఎన్ కౌంటర్ కథ నేపథ్యంలో కమర్షియల్ అంశాలు జోడించి ఈ సినిమాని తీశారు.

Rajinikanth Vettaiyan Movie Collections
Vettaiyan : టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వేట్టయన్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజయి మంచి విజయమే సాధించింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా తెలుగులో ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, రితికా సింగ్, దూశారా విజయన్, మంజు వారియర్, అభిరామి.. ఇలా అనేక మంది స్టార్స్ నటించారు.
ఫేక్ ఎన్ కౌంటర్ కథ నేపథ్యంలో కమర్షియల్ అంశాలు జోడించి ఈ సినిమాని తీశారు. వేట్టయన్ సినిమా నాలుగు రోజుల్లోనే 240 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా మూవీ యూనిట్ రజినీకాంత్ ని కలిశారు. మూవీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పారు. రజినీకాంత్ మూవీ టీమ్ అందర్నీ అభినందించారు. ఈ వీకెండ్ లోపు ఈజీగా 400 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు మూవీ టీమ్. వేట్టయన్ తర్వాత రజినీకాంత్ కూలి సినిమాతో బిజీగా ఉన్నారు.