Nivetha Thomas: బాలనటి నుండి ఉత్తమనటి వరకు నివేదా ప్రయాణం!

వెండితెర మీద రాణించాలంటే.. అందం, అభినయం, సహజంగా పాత్రలో ఇమిడిపోయే నైపుణ్యం కలిగి ఉండాలి. ఆయా పాత్రలలో పరకాయ ప్రవేశం చేసే సత్తా కూడా ఉంటే ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. దానికి సమయస్పూర్తి..

Nivetha Thomas: బాలనటి నుండి ఉత్తమనటి వరకు నివేదా ప్రయాణం!

Nivetha Thomas

Updated On : November 2, 2021 / 12:58 PM IST

Nivetha Thomas: వెండితెర మీద రాణించాలంటే.. అందం, అభినయం, సహజంగా పాత్రలో ఇమిడిపోయే నైపుణ్యం కలిగి ఉండాలి. ఆయా పాత్రలలో పరకాయ ప్రవేశం చేసే సత్తా కూడా ఉంటే ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. దానికి సమయస్పూర్తి కూడా తోడైతే వెనక్కి చూసుకొనే అవసరమే ఉండదు. ఇవన్నీ కలిస్తే నివేదా థామస్. నివేదా కథలను ఎంచుకునే విధానంలో ఇంటెలిజెన్సీ కనిపిస్తే.. అన్నిటిని మించి ఎలాంటి పాత్ర చేసినా అన్ని వర్గాల వారిని మెప్పించే తీరు ప్రేక్షకుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేస్తుంది. నేడు నివేదా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో కీలక విషయాలను చూద్దాం.

Mehreen Kaur Pirzada: మరికాస్త పెంచేసిన మెహ్రీన్..!

1995, నవంబర్ 2న జన్మించింది నివేదా ఏడేళ్ల వయసులో 2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ మై డియర్ బూతంలో కూడా నటించింది. మలయాళం సినిమా ‘వెరుథె ఒరు భార్య’ సినిమాలో జయరాం కుమార్తెగా నటించగా.. ఈ సినిమాకు గాను విమర్శకుల ప్రశంసలతో పాటు.. కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది. అలాగే చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించి అలా ఎదుగుతూ చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి సినిమాలతో తనని తాను నిరూపించుకుంది.

Puneeth Rajkumar: పునీత్ చివరి చూపుకు నోచుకోని కోలీవుడ్.. కారణం ఏంటి?

నివేదా వ్యక్తిగత విషయానికి వస్తే.. నివేదా తండ్రి థామస్ బిజినెస్ మేన్ కాగా.. తల్లి లిల్లీ. నివేదాకు నిఖిల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. నివేదాను ఇంట్లో అందరూ బేబీ అని పిలుస్తారట. పుట్టింది కేరళలోనే అయినా విద్యాభ్యాసం మొత్తం చెన్నైలోనే. మాతృబాష మలయాళంతోనే బాలనటిగా కెరీర్‌ని స్టార్ట్‌ చేసిన ఈ అమ్మడు.. మోడల్‌గా రాణిస్తూ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. తెలుగులో నానీ జెంటిల్‌మేన్‌ మొదలైన నివేదా నటనా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

Bigg Boss 5: ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ గెట్ టూ గెదర్.. ఎక్కడంటే?

నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 118, వీ వంటి సినిమాలతో తెలుగులో వరస సినిమాలను చేసిన నివేదా వ​కీల్‌ సాబ్‌లో అద్భుతంగా నటించి నటనలో బలమైన ముద్ర వేసింది. విభిన్నమైన పాత్రలు, సహజమైన నటన మాత్రేమే కాదు నిజ జీవితంలో సాహసాలు కూడా ఉండాలనుకొనే నివేదా.. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించింది. ప్రస్తుతం తెలుగులో మీట్‌ క్యూట్‌, మిడ్‌నైట్ రన్నర్స్ రిమేక్‌గా తెరకెక్కుతున్న మరో మూవీలో నటిస్తున్న నివేదా ఇప్పటి వరకు చేసిన సినిమాలలో దాదాపుగా అన్నీ సక్సెస్ కావడం విశేషం.