Movie Releases : ఈ వారం థియేటర్స్ లో తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
సరాకు పెద్ద సినిమాలు వచ్చి సందడి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. ఈ వారం కొన్ని చిన్న, మీడియం సినిమాలు ప్రేక్షకుల ముందుకు థియేటర్స్ లో రానున్నాయి.

November first Week Theatrical Telugu Releasing Movies List
Movie Releases : దసరాకు పెద్ద సినిమాలు వచ్చి సందడి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. ఈ వారం కొన్ని చిన్న, మీడియం సినిమాలు ప్రేక్షకుల ముందుకు థియేటర్స్ లో రానున్నాయి.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో క్రైం కామెడీ థ్రిల్లర్ గా ‘కీడా కోలా’ సినిమా నవంబర్ 3న రానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.
రక్షిత్ అట్లూరి హీరోగా సెబాస్టియన్ దర్శకత్వంలో నరకాసుర అనే సినిమా నవంబర్ 3న రాబోతుంది. ఒకప్పటి స్టార్ విలన్ చరణ్ రాజ్ తెలుగులో ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
కరోనా సమయంలో చేతబడులు నేపథ్యంలో వచ్చిన పొలిమేర సినిమా ఓటీటీలో మంచి విజయం సాధించింది. ఇప్పుడు పొలిమేర 2 సినిమా నవంబర్ 3న థియేటర్స్ లోకి రానుంది. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఘోస్ట్ సినిమా కన్నడలో దసరాకు రిలీజ్ అవ్వగా రెండు వారాల తర్వాత ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది. నవంబర్ 4న ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.
హిందీలో గతవారం రిలీజయి మంచి విజయం సాధించిన 12th ఫెయిల్ సినిమా తెలుగులో ఈ వారం రిలీజ్ అవ్వనుంది. నవంబర్ 3న ఈ సినిమా రిలిజ్ కాబోతుంది.
ఇవే కాకుండా విధి, ప్లాట్, మిడ్ నైట్ కిల్లర్స్, ద్రోహి.. వంటి పలు చిన్న సినిమాలు కూడా నవంబర్ 3న రిలీజ్ కానున్నాయి.