NTR 30 : షూటింగ్ లో జాయిన్ అయిన సైఫ్ అలీఖాన్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన NTR 30
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ NTR 30లో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో సైఫ్ విలన్ రోల్ చేస్తాడని కూడా అంటున్నారు. కానీ ఇన్ని రోజులు దీనిపై చిత్రయూనిట్ స్పందించలేదు. తాజాగా NTR 30 చిత్రయూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.

NTR 30 Movie Unit announced officially Saif Alikhan joined in Shoot
NTR 30 : RRR తర్వాత ఆల్మోస్ట్ సంవత్సరం గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్(NTR) తన నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న NTR 30 సినిమా ఇటీవలే మొదలైంది. కొరటాల(Koratala) దర్శకత్వంలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతోంది. బాలీవుడ్(Bollywood) భామ జాన్వీ కపూర్(Janhvi kapoor) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ కూడా పూర్తిచేసేశారు.
కొరటాల శివ ఈ సినిమా గురించి ఓపెనింగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ చాలా మాస్, యాక్షన్, వైలెంట్ గా ఉండబోతుందని చెప్పి సినిమాపై అప్పుడే అంచనాలని పెంచేశాడు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులని అలరిస్తున్నారు చిత్రయూనిట్.
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ NTR 30లో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో సైఫ్ విలన్ రోల్ చేస్తాడని కూడా అంటున్నారు. కానీ ఇన్ని రోజులు దీనిపై చిత్రయూనిట్ స్పందించలేదు. తాజాగా NTR 30 చిత్రయూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. సైఫ్ అలీఖాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడంటూ సెట్ లో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ ఉన్న ఫోటోలను రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నిజంగానే విలన్ రోల్ అయితే ఎన్టీఆర్ కి కరెక్ట్ గా సరిపోతాడని వ్యాఖ్యానిస్తున్నారు.
NTR 30 సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో పాటు ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారని అర్ధమవుతుంది. ఇప్పటికే జాన్వీ కపూర్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ని తీసుకురావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగి బాలీవుడ్ లో కూడా బజ్ క్రియేట్ అయింది.
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @NTRArtsOfficial pic.twitter.com/EArmVGXkLY
— Yuvasudha Arts (@YuvasudhaArts) April 18, 2023