NTR – Ram Charan : జపాన్ టాప్ మ్యాగజైన్ పై ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫోటోలు..

జపాన్ లో RRR సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్ టాప్ మ్యాగజైన్ పై ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫోటోలు..

NTR – Ram Charan : జపాన్ టాప్ మ్యాగజైన్ పై ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫోటోలు..

NTR and Ram Charan photos are in japan top magazine

Updated On : May 18, 2023 / 6:09 PM IST

NTR – Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా RRR. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలుసు. ఇక ఈ సినిమాకి కీరవాణి అందించిన నాటు నాటు (Naatu Naatu) సాంగ్ ప్రపంచ ప్రఖ్యాతి అవార్డు ఆస్కార్ (Oscar) ని అందుకొని సంచలనం సృష్టించింది. కాగా ఈ మూవీ జపాన్ లో కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ అండ్ చరణ్ కి జపాన్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

NTR30 : ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. బర్త్ డేకి గిఫ్ట్ రెడీ!

వీరిద్దరూ నటించిన పలు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యి మంచి ప్రజాధారణ పొందాయి. ఇక RRR చిత్రంతో జపాన్ లో వీరిద్దరి క్రేజ్ మరింత పెరిగి పోయింది. తాజాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఫోటోలను జపాన్ టాప్ మ్యాగజైన్ కవర్ పేజీ పై ప్రింట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను జపాన్ మీడియా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దానిని రీ ట్వీట్ చేస్తూ RRR బదులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే, జపాన్ లో RRR మూవీ క్రేజ్ అసలు తగ్గడం లేదు. ఇటీవలే ఆ చిత్రం అక్కడ 200 రోజులు పూర్తి చేసుకుంది.

Ram Charan : బ్రాడ్ పిట్ గురించి నాకు తెలియదు.. కానీ రామ్‌చరణ్ మాత్రం.. ప్రియాంక చోప్రా!

అంతేకాదు JPY 2 బిలియన్ల కలెక్షన్స్ కూడా అందుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రం ఇప్పటికే అక్కడ 24 ఏళ్ళ పాటు ఉన్న రజినీకాంత్ ముత్తు సినిమా కలెక్షన్స్ రికార్డుని బ్రేక్ చేసి జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద నెంబర్ వన్ ఇండియన్ సినిమాగా నిలిచింది. దానితో పాటు పలు మర్వెల్ మూవీ రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే స్పీడ్ కొనసాగితే జపాన్ హైయెస్ట్ మల్టీప్లేయర్ గా నిలిచిన టైటానిక్ రికార్డుని కూడా RRR మాయం చేయడం ఖాయం అంటున్నారు.